విశ్వక్ సేన్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన `ఓరిదేవుడు` సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చిక్కుల్లో పడి ఉన్నాడు.
దానికి గల కారణం వరస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ తన 11వ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న సినిమాకు యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో తన కుమార్తె ఐశ్వర్యను చేయాలని భావించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ఈ సినిమాను అర్జున్ హోమ్ బ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పై తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
అయితే త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏంటంటే.. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా చేయనన్నాడనీ.. ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే అగ్రిమెంట్ రాసిన తర్వాత విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో అర్జున్ తనపై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సీనియర్ హీరో అర్జున్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి విశ్వక్ తప్పుకోవడానికి గల కారణం ఏమిటో? తెలియక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.