కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీందర్ మరియు బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిలా పెళ్లి వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ప్రేమించి,పెళ్లి చేసుకుని పాపులర్ అయిన జంట వీరిదే అని చెప్పాలి. పైగా వీరిద్దరికీ ఆల్రెడీ వివాహం జరిగి విడాకులు తీసుకోవడం కూడా జరిగింది.
అయితే వీరిద్దరి జంట ఇంత పాపులర్ అవ్వడానికి గల ప్రధాన కారణం రవీందర్ భారీ ఆకారంతో ఉండడం.. మరియు మహాలక్ష్మి సన్నగా అందంగా ఉండడమే అని చెప్పాలి. అయితే అటువంటి రవీందర్ ను మహాలక్ష్మి కేవలం డబ్బు కోసమే పెళ్లి చేస్తుందంటూ అందరూ భావించారు. అయితే తాజాగా మహాలక్ష్మి పై నటి జయశ్రీ సంచలన కామెంట్స్ చేసింది. అయితే మహాలక్ష్మికి తన భర్తకు ఎఫైర్ ఉందంటూ ఆ కారణంగానే మహాలక్ష్మి మొదటి భర్త ఆమెను వదిలేసాడంటూ ఆమె చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా తన ముందే తన భర్త మహాలక్ష్మికి వీడియో కాల్ చేసి మాట్లాడేవాడని.. మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలిచేవాడని ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆమె బయట పెట్టింది. అయితే ఈ వార్తలపై స్పందించిన మహాలక్ష్మి.. జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందంటూ.. ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని తెలిపింది. అంతేకాకుండా మహాలక్ష్మి తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడడంతో అతని ప్రేమించి, పెళ్లి చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేశానని.. ఆమెపై వచ్చిన వార్తలుకు క్లారిటీ ఇచ్చింది.