ఈ హీరోలకి ఇప్పుడైనా అదృష్టం కలిసొచ్చేనా..?

టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు ఏడాదికి సరికొత్తగా పరిచయమవుతూనే ఉన్నారు. ఇక ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వీరి సినిమాలు ఏడాదికి ఒకటి విడుదలవడం చాలా కష్టంగా మారుతోంది. కానీ ఇందులో కొంతమంది హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ ఉన్నారు. కంటెంట్ బెస్ట్ ఉండే చిత్రాలు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత సినీ పరిశ్రమ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా చిన్న హీరోల సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద విడుదలై కొన్ని సినిమాలు విజయం సాధించగా మరికొన్ని సినిమాలు చేతికిలపడాల్సి వస్తోంది.

Changing Face of Young Tollywood Heroes in Telugu Cinema
సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు అభిమానులు అంచనాలను ఓమ్ము చేస్తున్నారు. అలాంటి వారిలో నాచురల్ స్టార్ నాని, నాగచైతన్య, గోపీచంద్, విజయ్ దేవరకొండ తదితర హీరోలు సక్సెస్ వేగానికి కొన్ని చిత్రాలు బ్రేక్ వేశాయని చెప్పవచ్చు. నాని కెరియర్ల జెర్సీ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ విషయం దక్కలేదు. ప్రస్తుతం దసరా సినిమా పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇక మరొక హీరో నాగచైతన్య చివరిగా బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగిలాయి. ప్రస్తుతం కృతి శెట్టితో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు.

Telugu Young Heroes | కుర్రహీరోల చేతినిండా సినిమాలు..కానీ సక్సెస్‌  మాటేంటి..! - Namasthe Telangana

ఇక గోపీచంద్ కూడా సరైన సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బారి ఫ్లాప్ చూశారు. ప్రస్తుతం సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఒక హీరో నితిన్ కూడా వరుస సినిమా ఫ్లాపులతో సతమతమవుతూ ఉన్నారు. అందుచేతనే కథ ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ సనైన నిర్ణయాలు తీసుకోవాలని అభిమానులు సైతం వీరిని సూచిస్తూ ఉన్నారు.

Share post:

Latest