తాజాగా అల్లు శిరీష్ నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం శరవేగంగా చేయడంతో మరింత ప్లస్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీటింగ్ ఏర్పాటు చేశారు చిత్ర బృందం.ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పాల్గొంటూ గత కొన్నాలుగా అల్లు ఫ్యామిలీలో సఖ్యత లేదు అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టడం జరిగింది. హీరో అల్లు అర్జున్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని మాట్లాడుతూ అల్లు శిరీష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ముఖ్యంగా తన కెరీర్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన బన్నీ వాసు అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నాన్న అల్లు అరవింద్ కి పాత్ర ఎంత ఉందో బన్నీ వాసుకి అంతె పాత్ర ఉంటుంది అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బన్నీ వాసు మరియు అల్లు అర్జున్ మంచి స్నేహితులనే విషయం అందరికీ తెలిసిందే. గీత ఆర్ట్స్ బ్యానర్లో ప్రముఖ స్థానాన్ని బన్నీ వాసుకు కల్పించడం జరిగింది. అల్లు అరవింద్ కూడా బన్నీ వాసుని చాలా నమ్మకస్తుడు అని ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉండడమే కాకుండా పూర్తిగా బన్ని వాసుకే పలు బాధ్యతలు అప్పగించారు.
ముఖ్యంగా సినిమాల నిర్మాణ విషయంలో బన్నీ వాసుకి ఉన్న ప్రతిభ గురించి తెలిసే అల్లు అరవింద్ గీతా-2 బ్యానర్ బాధ్యతలు మొత్తం ఆయనకే అప్పగించారు. అల్లు అరవింద్ కంటే బన్నీ వాసు తన కెరీర్ కి ముఖ్య కారణం అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు బన్నీ వాస్తు స్థాయిని మరింత పెంచేశాయని చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ కెరీర్లు ముఖ్యమైన వ్యక్తులలో బన్నీ వాసు కూడా ఒకరిని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.