స్టార్ హీరో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ -2 అన్ని వర్గాల ప్రేక్షకులను నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సబ్స్క్రిప్షన్ మెంబర్లు పెరిగారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో తన హవా కొనసాగిస్తూ ఇలా టాక్ షో తో తమ అభిమానులను ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉన్నారు. అన్ స్టాపబుల్ షోకు తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక గెస్ట్లుగా హాజరు అయ్యారు. మరో ఇద్దరు ఎపిసోడ్ చివర్లో హాజరై సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ స్నేహితులలో ఒకరు మాట్లాడుతూ ఆశ గుర్తుందా అంటూ బాలయ్యకు గుర్తుకు చేస్తున్నారు..
అయితే బాలయ్య ఎందుకు గుర్తులేదు అని చెబుతూ ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి. అంతే కదా అని చెప్పగా బాలకృష్ణ వేరే వాటి గురించి మాట్లాడుతున్నారని తెలియని విషయం ఇంకొకటి ఉందని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. అలా చెప్పిన వెంటనే బాలయ్య వ్యక్తి నోరు మూసేశారు. బాలయ్య జీవితంలో ఆశ అనే ప్రశ్న ఈ షో ద్వారా వ్యక్తం కాగా ఆశ, బాలయ్య క్లాస్మేట్ అన్నట్లుగా సమాచారం. బాలయ్య, ఆశ మధ్య ఏదో ఆసక్తికరమైన సంఘటన ఉండడం వల్లే అతని ఫ్రెండ్స్ ఈ విధంగా కామెంట్స్ చేశారని సమాచారం.
మరి కొంతమంది మాత్రం ఆశ, బాలయ్య క్రష్ అయి ఉండవచ్చని తెలియజేస్తున్నారు.రాబోయే రోజుల్లో బాలయ్య, ఆశ అనే పేరు వెనుక అసలు కథను తెలియజేస్తారేమో చూడాలి.తన కెరియర్లో మోస్ట్ డిఫికల్ట్ మూవీ ఏదైనా ప్రశ్న ఉందా అనే ప్రశ్న ఎదురుగా.. అందుకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని తెలిపారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి బాలయ్య హీరో అవుతారని అనుకోలేదని తెలిపారు. దాంతో బాలయ్య నువ్వు సీఎం అవుతావని అసలు నేను అనుకోలేదని కౌంటర్ వేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో ఆహ లో వైరల్ గా మారుతోంది.