అలాంటివన్నీ కేవలం ఎన్టీఆర్ సినిమా మీదే ఎందుకు జరుగుతున్నాయి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు పొందారు. దీంతో ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండాలని అందుకు తగ్గట్టుగా కథను డైరెక్టర్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. అలా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తన 30 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పైన పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కేవలం ఎందుకు ఎన్టీఆర్ సినిమా పైన ఇలాంటి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.

Latest: NTR 30 is still on – Pre-production work is underway | 123telugu.com
జనతా గ్యారేజ్ సక్సెస్ తో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ మొదలయ్యింది. కొరటాల శివ మీద నమ్మకంతో ఎన్టీఆర్ #NTR 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ఫ్రీలుక్ మోషన్ పోస్టర్ను విడుదల చేయడంతో ఆ వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. దీంతో రోజు రోజుకి ఈ సినిమా పైనే పలు రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఎన్టీఆర్ పూర్తిగా పక్కన పెట్టిన వార్తలు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి.

NTR 30: Jr NTR's Next With Koratala Siva Officially Shelved? - Filmibeat

ముఖ్యంగా కథ విషయంలో ఎన్టీఆర్ చాలా సంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కష్టమే అని పలు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక రూమర్ పుట్టుకొస్తోంది. ఫండింగ్ సమస్యల కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దర్శక ,నిర్మాతలు డబ్బులు పెట్టే వారి కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి యువ సుధా ఆర్ట్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నిర్మిస్తున్నారు. దీంతో ఈ సినిమాకి ఫైండింగ్ సమస్య ఎలా కారణమవుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక హీరోయిన్ విషయంలో కూడా పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాలపై స్పష్టత ఇస్తే తప్ప రూమర్లు ఆగే అవకాశం లేదని అభిమానులు భావిస్తున్నారు.

Share post:

Latest