టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇక ఆ స్థానాన్ని అల్లు అర్జున్ కూడా నిలబెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ యంగ్ హీరో. ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో హీరోగా అల్లు శిరీష్ నటించిన హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాకేష్ శశీ దర్శకత్వం వహించారు.
ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది .ఇక ఈసారైనా అల్లు శిరీష్ మంచి హిట్టు కొట్టేలా ఉన్నారని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే తన తమ్ముడు సినిమాకి అల్లు అర్జున్ ఏ విధంగా సపోర్ట్ చేయకపోవడంతో ఈ విషయం సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ సైతం ఇప్పటివరకు కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. టీజర్ లేదా ట్రైలర్ను అయినా లాంచ్ చేసి తన మద్దతు ఈ సినిమా కి ఉందని తెలపడం లేదని అల్లు శిరీష్ అభిమానులు భావిస్తున్నారు.
ఇక గతంలో అల్లు శిరీష్ నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ గానే నిలిచాయి. దీంతో మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఊర్వశివో రాక్షసివో అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు విడుదల చేశారు. అల్లు శిరీష్ కు పాన్ ఇండియా స్టార్ హీరో తన అన్నయ్య మద్దతు నిలిస్తే ఈ సినిమా మంచి బజ్ ఏర్పడేది అని చెప్పవచ్చు. మరొకవైపు బాలకృష్ణ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చి షిరీస్ కు తన వంతు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరంతేజ్ ట్విట్ చేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం సైలెంట్ గా ఉండడం ఈ విషయం వైరల్ గా మారుతోంది.