తెలుగు సినీ పరిశ్రమలో నటిగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి సావిత్రి. ఈమె ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటిస్తుందని చెప్పవచ్చు.తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోల సరసన అందరితో నటించి పేరు ప్రఖ్యాతలు పొందింది సావిత్రి. ఈ విధంగా తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా తమిళం, హిందీ వంటి భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించింది. అక్కడ కూడా ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. ఒకానొక సమయంలో సావిత్రి కాల్ సీట్ల కోసం ఎంతోమంది దర్శక నిర్మాతలు సైతం ఎదురుచూసేవారంటే ఈమె ఎలాంటి నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే ఇలా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె రహస్యంగా జెమినీ గణేష్ అనే హీరో ని వివాహం చేసుకున్నది. ఇలా వివాహమైన తర్వాత ఈమె జీవితం ఒక్కసారిగా మారిపోయిందట. తన సంపాదించిన దానిలో ఎంతో దానధర్మాలు చేస్తూనే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన సావిత్రి.. చివరి క్షణాల్లో మాత్రం చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించిందని సమాచారం. ఇక తన చుట్టూ ఉన్న వాళ్లే తనని నమ్మించి తన ఆస్తులను మొత్తం కొట్టేసారని సినిమా అవకాశాలు రాకపోవడంతో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొని తాగుడుకు బానిసై చివరి క్షణాలలో మరణించిందని ఇండస్ట్రీలో ఇప్పటికీ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
ఇండస్ట్రీలో ఇంతటి గుర్తింపు పొందిన సావిత్రి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే సావిత్రి చివరి రోజుల్లో వీరు సహాయం చేయకపోవడానికి కారణం ఉందని.. అది కేవలం సావిత్రి మొండి వైఖరి కారణమంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.సావిత్రి తాగుడుకు బానిసైన సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్నోసార్లు తనని ఆ అలవాటును దూరం చేసుకోవాలని సూచించారట. ఆమె మొండి వైఖరి కావడంతో మానుకోలేకపోవడంతో చివరి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి వారు సావిత్రిని అసలు పట్టించుకోలేదని సమాచారం.