ఈ క్షణం కోసమే నాలుగు దశాబ్ధాలుగా వెయిటింగ్..టైం చూసి కొట్టిన చిరంజీవి(వీడియో)..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీలోకి ఎవరు హెల్ప్ లేకుండా రావడమే గొప్ప విషయమైతే.. వచ్చిన తర్వాత హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి ..ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా తన పేరును మరింత పాపులర్ చేసుకున్నాడు. అంతేకాదు తన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి నలుగురు వచ్చేలా తన పేరు ని రోల్ మోడల్ గా క్రియేట్ చేసుకున్నారు .

కాగా ఇప్పటికీ చిరంజీవి సినిమాల్లో హీరోగా నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని.. యంగ్ హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నారు. కాగా రీసెంట్గా గోవాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 53వ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2022 లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు . ఇండియన్ బెస్ట్ ఫిలిం పర్సనాలిటీ అవార్డుకు చిరంజీవి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డు చిరంజీవికి వరించింది అని తెలియగానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఫోన్ చేసి చిరంజీవికి విష్ చేశారట . అంతేకాదు కోట్లాదిమంది అభిమానులు, ఎంతో మంది స్టార్స్ .. నాకు విష్ చేయడం చాలా హ్యాపీగా అనిపించిందని ..ఈ క్షణం కోసం నేను కొన్ని దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కాగా చిరంజీవి మాట్లాడుతూ..” ఓపిక ఉన్నంతకాలం సినిమాలు చేస్తానని అభిమానులకి హామీ ఇచ్చారు. అంతేకాదు తనదైన స్టైల్ చమత్కరిస్తూ యువ హీరోలు తనకు పోటీ కాదని తానే వాళ్లకు పోటీ ఇస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ప్రారంభమైన ఆయన జీవితం.. చిరంజీవి వరకు రావడానికి కీలకపాత్ర పోషించింది అభిమానులే అని.. ఆయన ప్రాణం ఉన్నంతవరకు వారిని మర్చిపోయే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమాకు ప్రాంతీయ భేదాలు లేవని సినిమా అంటే ఒకటే అని ..అది ఏ భాష అయినా సరే సినిమానే అని.. అందరిని ఎంటర్టైన్ చేయడమే సినిమా లక్ష్యం” అని చెప్పుకొచ్చాడు . అంతే కాదు గతంలో ఈ అవార్డు ఫంక్షన్ కి వచ్చిన సందర్భాన్ని కూడా చిరంజీవి గుర్తు చేసుకున్నారు . ప్రజెంట్ ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

Share post:

Latest