బుల్లితెరపై ప్రసారమయ్యే అటువంటి పటాస్ షో ప్రతి ఒక్కరికి తెలిసినదే.ఈ షో వల్ల ఎంతో మంది కమెడియన్స్ బుల్లితెరపై అలరిస్తూ ఉన్నారు. అలా పటాస్, జబర్దస్త్ ,అదిరింది వంటి షోలలో చాలామంది యువ కమెడియన్లు తమ ప్రతిభను చూపిస్తూ ఉన్నారు. అలా పటాస్ షో తో యంగ్ కమెడి న్ గా పేరుపొందిన యాదమ్మ రాజు బాగా పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న యాదమ్మ రాజు తాజాగా ఒక ఇంటివాడు కాబోతున్నాడు.నేడు యాదమ్మ రాజు తన ప్రేయసి స్టెల్లా ని నిశ్చితార్థం చేసుకోవడం జరిగింది.
కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. ఇక నూతన జంట చూడం ముచ్చటగా ఉంది అంటూ యాదమ్మ రాజు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి పలు షో లలో పాల్గొనడమే కాకుండా యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు రీల్స్ కూడా చేస్తూ బాగా ఆకట్టుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత జంటగా హాజరు కావడం జరిగింది.
ఒక స్కిట్లో యాదమ్మ అనే రోల్ ప్లే చేయడంతో అందరూ యాదమ్మ రాజు అని ముద్దుగా పిలుస్తూ ఉన్నారు. యాదమ్మ రాజు బుల్లితెరపై కామెడీ చేయడంతో పాటు పలు ఎమోషనల్ స్కిట్లను కూడా చేస్తూ ఉండేవారు ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా పలు అవకాశాలు రావడంతో సినిమాలలో కమెడియన్గా నటిస్తూ తన కెరీర్ అని ముందుకు సాగిస్తూ ఉన్నారు. సద్దాం తో కలిసి యాదమ్మ రాజు చేసే కామెడీ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ప్రస్తుతం యాదమ్మ రాజు కు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram