విశాఖ నార్త్ బరిలో కే‌కే ఫిక్స్..!

రాష్ట్రంలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది…ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు..ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ-టీడీపీలు ఓ వైపు పదునైన వ్యూహాలతో ముందుకెళుతూనే, మరో వైపు నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు..అసెంబ్లీ స్థానాల్లోని నేతలతో మీటింగులు పెట్టి, దిశానిర్దేశం చేస్తున్నారు.

తాజాగా జగన్..విశాఖ నార్త్ నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. 175కి 175 సీట్లు గెలిచి తీరాలని,మరో 30 ఏళ్ళు మనదే అధికారమని అన్నారు. అలాగే విశాఖ నార్త్‌కు చాలా చేశామని, నార్త్‌లో 76 శాతం ఇళ్లకు పథకాలు ఇచ్చామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కే‌కే రాజుని భారీ మెజారిటీతో గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు. అంటే విశాఖ నార్త్ సీటు కే‌కే రాజుకు ఫిక్స్ అని చెప్పొచ్చు. అయితే గత రెండు ఎన్నికల్లోనూ విశాఖ నార్త్‌లో వైసీపీ గెలవడం లేదు.

గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారు. వైసీపీ నుంచి కే‌కే రాజు పోటీ చేసి ఓడిపోయారు. అయితే గెలిచాక గంటా యాక్టివ్ గా లేరు. పార్టీలో కనిపించడం లేదు. నియోజకవర్గంలో తిరగడం లేదు. కానీ కే‌కే రాజు మాత్రం నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. ప్రజలకు అండగా ఉంటున్నారు. ఎమ్మెల్యే మాదిరిగా పనిచేస్తున్నారు. అక్కడ ఆయనకు పాజిటివ్ బాగానే ఉంది.

కాకపోతే ఇక్కడ ప్రత్యర్ధి బట్టి గెలుపోటములు మారిపోవచ్చు. పైగా టి‌డి‌పి-జనసేన గాని కలిసి పోటీ చేస్తే కే‌కే రాజుకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా సింగిల్ గా పోటీ చేస్తే..ఈజీగా రాజు గెలిచేస్తారు. ఇక ఇక్కడ బి‌జే‌పి నేత విష్ణుకుమార్ రాజుకు కూడా కాస్త బలం ఉంది. అలాంటప్పుడు టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కాంబినేషన్ గాని సెట్ అయితే కే‌కే రాజు గెలుపు డౌటే. చూడాలి మరి ఈ సారి కే‌కే రాజు భవిష్యత్ ఎలా ఉంటుందో.