టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలలో రామకృష్ణ, బాలసుబ్రమణ్యం ,మాధవ పెద్ది రమేష్, ఇలా ఎంతోమంది కృష్ణ నటించిన సినిమాలలో పాటలు పాడారు. అయితే మంచి పాపులారిటీ సంపాదించిన బాలసుబ్రమణ్యం వెండితెర పైన గాయకుడిగా అడుగుపెట్టిన కొత్తలో చిన్న చిన్న నటులకు మాత్రమె గాత్రాన్ని ఇచ్చేవారట. అయితే బాలసుబ్రమణ్యం కు స్టార్ హీరోలకు పాడే అవకాశం వచ్చిందట. ఇదంతా కేవలం సూపర్ స్టార్ కృష్ణ సినిమాల వల్లే సాధ్యమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలను బాలసుబ్రమణ్యం ఎన్నోసార్లు స్వయంగా పలు సందర్భాలలో తెలియజేశారు.
కెరియర్ ప్రారంభంలో బాలసుబ్రమణ్యాన్ని కృష్ణ గారే ప్రోత్సహించే వారట. అలా కృష్ణ నటించిన నేనంటే నేను సినిమాకు మొత్తం పాటలు బాలునే పాడారట. ఎస్పీ కొందడపాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అలా వీరిద్దరి మధ్య ఒక స్నేహం ఏర్పడింది. అయితే అలా ఏర్పడిన స్నేహం కేవలం ఒక్క సినిమా పారితోషక విషయంలో వచ్చిన విభేదాల వల్ల వీరిద్దరూ దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదట.. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
కృష్ణ ఇండస్ట్రీలో తన మీద వచ్చిన వార్తలపై కూడా ఎప్పుడూ ఏ విధంగా స్పందించలేదు. అంతేకాకుండా ఏ నటుడితో కూడా పెద్దగా విబేధాలు పెట్టుకోరు. ఒకవేళ ఏదైనా సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని మర్చిపోతూ ఉంటారని ఎంతోమంది సినీ ప్రముఖుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. అయితే బాలసుబ్రహ్మణ్యం ,కృష్ణ మధ్య గొడవ జరిగిన తర్వాత కూడా బాలు ఎక్కడ కనిపించినా సంతోషంగానే పలకరించే వారిని బాలసుబ్రమణ్యం ఎన్నో సందర్భాలలో తెలిపారు. కృష్ణాను బాలసుబ్రమణ్యాన్ని కలిపింది పాటల రచయిత సుందర రామ్మూర్తి. వీరి సహాయంతోనే మళ్లీ రౌడీ నెంబర్ వన్ అనే చిత్రంతో కృష్ణ సినిమాకి పాటలు పాడారు బాలసుబ్రమణ్యం. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.