టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నిన్న తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు.
అయితే గుండెపోటుతో హాస్పిటల్‌లో జాయిన్ అయినప్పటికీ.. ఆపై మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో.. ఘట్టమనేని కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక కృష్ణ హాస్పిటల్ లో చేరినప్పుడు తీసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో ఆయనకు సెలైన్ బాటిల్ పెట్టినట్టు స్పష్టమవుతుంది. ఇదే ఆయన చివరి ఫోటో అని అంటున్నారు. ఈ ఫోటోను చూసి కృష్ణ ఫ్యాన్స్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. కాగా, నిన్నంతా నానక్‌రామ్‌గూడలోని తన నివాసమైన విజయకృష్ణ నిలయానికి ఆయన పార్థివదేహాన్ని ఉంచగా..పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక నేటి మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.