పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నడు. అంతేకాదు రామాయణం ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమాని జూన్ 16 2023 కి వాయిదా వేస్తున్నట్లు ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాడు.
ఇక దర్శకుడు మాట్లాడుతూ.. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు ఒక అద్భుతమైన ప్రపంచంలో కి తీసుకువెళ్లే అనుభూతిని అందించడానికి మాకు మరింత సమయం కావాలని.. భారతదేశం గర్వించదగ్గ సినిమా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.. మాకు మీ అందరి మద్దతు ఆశీస్సులు ప్రేమ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్నాయని ఆయన తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన VFX కోసం సుమారు రూ.100నుంచి 150 కోట్ల బడ్జెట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ రావణాసుడుగా సైఫ్ అలీ ఖాన్ అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన టి సిరీస్ నిర్మిస్తుంది.
जय श्री राम…#Adipurush releases IN THEATRES on June 16, 2023.#Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 #ShivChanana @manojmuntashir @TSeries @RETROPHILES1 @UV_Creations @Offladipurush pic.twitter.com/kXNnjlEsib
— Om Raut (@omraut) November 7, 2022