రూ. 100 కోట్లు న‌ష్ట‌పోయిన వెంకీ.. అన‌వ‌స‌రంగా తొంద‌ర ప‌డ్డాడా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తొందరపాటు కారణంగా రూ.100 కోట్లు నష్టపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళం లో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్‌ చేశారు. అనూహ్యంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

అయితే ఆ తర్వాత దృశ్యం కు సీక్వెల్ గా మోహన్ లాల్ `దృశ్యం `2 చేసాడు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అదే సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు. మొదట ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని భావించారు. కానీ మ‌న‌సు మార్చుకుని ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ‌ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా స్ట్రీమింగ్‌ చేశారు. తెలుగులో సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక హిందీలో అజయ్ దేవగన్ సైతం `దృశ్యం 2` ను రీమేక్ చేసి ఇటీవల వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశాడు. ఊహించినట్టుగానే ఈ సినిమా నార్త్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆకట్టుకుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 80 కోట్ల నెట్ వ‌సూళ్ల‌ను రాబట్టింది. గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక బాలీవుడ్ తీవ్రంగా సతమతమవుతుంది. ఇలాంటి తరుణంలో దృశ్యం 2 బాలీవుడ్ బాక్సాఫీస్ ను వేరే లెవెల్ లో షేక్‌ చేస్తుంది. ఇక ఇదే జోరు కొనసాగిస్తే లాంగ్ లెన్‌ లో ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్ల నెట్ క‌లెక్ష‌న్స్ ను రాబట్టడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ సినిమా వ‌సూళ్ల‌ను చూసి తెలుగులో సైతం ఈ సినిమాను థియేటర్లో విడుదల చేసి ఉంటే అటు ఇటుగా రూ. 100 కోట్ల వసూళ్లు రాబట్టేదని, వెంకీ అనవసరంగా తొందరపడ్డాడని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest