వీర‌సింహారెడ్డి మ‌రో అఖండే… బాక్సులు పేలిపోయాయ్‌…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వ‌చ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద‌బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయ్యిందో చూశాం. బాల‌య్య కెరీర్‌లోనే అఖండ బిగ్గెస్ట్ హిట్ అవ్వ‌డంతో పాటు ఏకంగా రు. 200 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాకు థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చ హైలెట్ అయ్యింది. చాలా థియేట‌ర్ల‌లో అఖండ బీజీఎం దెబ్బ‌కు బాక్సులు ప‌గిలిపోయాయి. దీంతో చాలా థియేట‌ర్లు త‌మ సౌండ్ సిస్ట‌మ్ వాల్యూమ్ త‌గ్గించుకుంటున్న‌ట్టు చెప్పాయి.

Veera Simha Reddy

అమెరికాలో ఓ థియేట‌ర్లో బాక్సులు ప‌గిలి పోవ‌డంతో అక్క‌డ థియేట‌ర్లు కూడా తాము సైడ్ బాక్సులు ఆపేశామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న కూడా అప్ప‌ట్లో హైలెట్ అయ్యింది. ఇప్పుడు వీర‌సింహారెడ్డికి కూడా అదే ప‌రిస్థితి రానుందా ? అంటే థ‌మ‌న్ చేసిన పోస్టు చూస్తే అవున‌నే తెలుస్తోంది. అస‌లు సినిమా ఫ‌స్ట్ సాంగ్ రాక‌ముందే బాక్సులు ప‌గిలిపోయాయి.

తాజాగా వ‌చ్చిన జై బాల‌య్య సాంగ్ లిరిక‌ల్ సాంగ్‌ దెబ్బకి సౌండ్ వూఫర్ బద్దలయ్యిపోయింది అంటూ థమన్ ఓ ఫోటో షేర్ చేసి సినిమాపై మ‌రింత ఎగ్జైట్మెంట్ పెంచాడు. ఇక ఈ రోజు వ‌చ్చిన సాంగ్‌లో లిరిక్స్ అయితే పేలిపోయాయి. బాల‌య్య క్యారెక్ట‌ర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా ఉందో సాంగ్ చెప్ప‌క‌నే చెప్పేసింది. మ‌రి ఈ సాంగ్ సోష‌ల్ మీడియాను ఇప్ప‌టికే షేక్ చేస్తుండ‌గా.. రేపు థియేటర్ల‌లో బాక్సులు ఎలా బ‌ద్ద‌లు కొడుతుందో ? చూడాలి.

Share post:

Latest