మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్ జె సూర్య, అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సునీల్ తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. రీసెంట్ గా న్యూజిలాండ్ లో కొత్త షెడ్యూలను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లోచరణ్-కియారాలపై ఓ డ్యూయెట్ సాంగ్ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే షూటింగ్ బ్రేక్ లో చిత్ర టీమ్ మొత్తం ఒకే చోట చేరి సరదాగా మాట్లాడుకుంటూ స్నాక్స్ తింటున్న ఫోటోలను కియారా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో చరణ్, కియారాలు కలిసి ఎంచక్కా బర్గర్లు లాగిస్తూ పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే న్యూజిలాండ్ లో చరణ్ తో ఎంజాయ్ చేస్తున్న కియారాను చూసి మెగా కోడలు ఉపాసన కుళ్ళుకుందో ఏమో కానీ.. `నేను మీతో రాలేకపోయినందుకు బాగా ఫీలవుతున్న మిస్ యూ` అంటూ కీర ఫోటోల కింద కామెంట్ చేసింది.