అన్ స్టాపబుల్:2 ఇద్దరు బడా పొలిటిషన్స్ మధ్య అలనాటి స్టార్ హీరోయిన్.. బాలయ్య మజాకా..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీర సింహారెడ్డి షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో బాలకృష్ణతో కొన్ని కీలకమైన సన్నివేశాలు ఆ షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని కూడా వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు.

వీటితోపాటు బాలకృష్ణ ఆహాలో చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మొదటి సీజన్ ని ఎవరు ఊహించిన విధంగా ఇండియాలోనే మాస్కా బాబ్ ఎవర్ గ్రీన్ టాక్ షోగా నిలబెట్టాడు బాలయ్య. ఇప్పుడు రెండో సీజన్ కూడా రెట్టింపు ఉత్సాహంతో తనదైన రీతిలో అలరిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మూడు ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్నా ఈ టాక్ షో… ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ రాబోతుంది… ఈ ఎపిసోడ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మరియు ఆనాటి శాసనసభ స్పీకర్ సురేష్ రెడ్డి అతిథులుగా రానున్నారని ఆహా టీమ్ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఇక ఇప్పుడు ఎపిసోడ్ కి వీరితోపాటు అలనాటి మేటి నటి రాధికా శరత్ కుమార్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన హింట్ కూడా ఆహా ఇచ్చింది. స్వాతిముత్యం అయినా ఆమె, స్వాతికిరణం అయినా తనే అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది. ఆ పోస్టుకి సోషల్ మీడియాలో ఉన్న నెటిజెన్స్ నుండి వెంటనే దీనికి కామెంట్లు చేయడం ప్రారంభించారు. దీనితో పాటు మరో పోస్ట్ కూడా షేర్ చేసింది. అందులో రాధికా శరత్ కుమార్ పవర్ ఫ్యాక్ట్ సెల్ఫి ను పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ షో కి ఇద్దరి రాజకీయ నాయకులతో పాటు అలానాటి స్టార్ హీరోయిన్ రాధిక వస్తున్నట్టు తెలియడంతో అభిమానులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నాను.. ఈ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అంటు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share post:

Latest