ఆ ఇద్ద‌రు హీరోల‌తో త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార్‌.. మరి మ‌హేష్ ప‌రిస్థితి ఏంటి?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఒకరు. తనదైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన త్రివిక్రమ్.. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. అది కూడా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడ స్టార్స్ తో అట‌. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలని త్రివిక్ర‌మ్ కసరత్తులు చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే ఓ మంచి కథను రెడీ చేసే పనిలో పడ్డాడని తాజాగా ఓ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. దీంతో మహేష్ బాబు పరిస్థితి ఏంటా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మహేష్ 28వ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపు మహేష్ తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. దీంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఈ మూవీస్ చిత్రీక‌ర‌ణ‌ను త్వ‌ర‌లోనే మ‌ళ్లీ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ మూవీ పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ రామ్ చరణ్-అల్లు అర్జున్ ల‌తో మల్టీ స్టార్ చేయనున్నాడని ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఇదే నిజమైతే మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవ్వడం ఖాయం.

Share post:

Latest