ట్రైలర్: మాస్ యాక్షన్ తో అదరగొడుతున్న.. విశ్వక్ సేన్ ధమ్కీ..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా తన దర్శకత్వంలోనే తానే హీరో గా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం.. దాస్ కా ధమ్కీ. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ లభించింది.ఈ క్రమంలోని నిన్నటి రోజున ట్రైలర్ ని కూడా ఆవిష్కరించారు చిత్ర బృందం.ధమ్కీ ట్రైలర్ 1.0 ని నందమూరి బాలకృష్ణ లాంచ్ చేయడం జరిగింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో డబుల్ రోల్ లో కనిపిస్తున్నారు. ఇందులో ఒక పాత్ర వెయిటర్ గా కనిపిస్తే మరొక పాత్ర ఒక డబ్బున్న అబ్బాయిగా కనిపిస్తారు. కొన్ని కోట్ల రూపాయలు ఉన్న కంపెనీ కలిగిన ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించగా.. ఆ కుటుంబ పెద్ద యొక్క అభ్యర్థన పై ఒక వెయిటర్ గా అతని స్థానంలోకి వెళ్తారు విశ్వక్ సేన్. ఇక తర్వాత ఆ కుటుంబంలో చిరునవ్వులు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో కొంతమంది శత్రువులు ఎదుర్కోవలసి వస్తుంది.

ఇందులో విశ్వక్ సేన్ రెండు విభిన్నమైన క్యారెక్టర్ లను రాసుకోవడమే కాకుండా.. వాటి మధ్య తేడాను తీయడానికి కూడా చాలా స్పష్టంగా కనిపించేలా చేశారు. ఇందులో హీరోయిన్గా నివేద పేతురాజు నటిస్తోంది. ఇక ట్రైలర్ చూస్తే స్టోరీ రొటీన్ గానే ఉన్నప్పటికీ కానీ సరికొత్తగా ప్రజెంటేషన్ చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. ఇందులో రావు రమేష్, హైపర్ ఆది, మహేష్ ,రోహిణి తదితరులు కీలకమైన పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా వైరల్ గా మారుతోంది.

Share post:

Latest