ఘట్టమనేని కృష్ణ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులో సూపర్ స్టార్‌గా నిలిచిపోయాడు. అల్లూరి సీత రామరాజు పాత్రలో నటించి ఆ పాత్రను ఆయన తప్ప మరొకరు చేయలేరని నిరూపించాడు. అంతేకాకుండా, కౌబాయ్ సినిమాలాంటి వాటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి తెలుగు జేమ్స్ బాండ్‌గా పేరు తెచ్చుకున్నాడు కృష్ణ. అలాంటి అగ్రనటుడు సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం శారీరకంగా మనతో లేకపోయినా ఆయన సినిమాల ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటాడు.
సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి కృష్ణ ధరించే నల్ల కళ్లద్దాలు గురించి. ఆయన పబ్లిక్‌లోకి ఎప్పుడు రావాలనుకున్న కూలింగ్ గ్లాస్సెస్ కంపల్సరీగా పెట్టుకునేవారు. అయితే ఆయన ఆ కూలింగ్ గ్లాసెస్ ధరించడానికి ఒక కారణం ఉందట. దాని గురించి ఒక ఇంటర్వ్యూలో ఆయన సతీమణి విజయనిర్మల వివరించారు.
అలానే కృష్ణ ఏ పబ్లిక్ మీటింగ్‌కి వెళ్లినా కూడా విజయనిర్మల ఆయన వెంటే వెళ్లారట. దాని గురించి కూడా ఆమె వివరించారు. ఆమె సూపర్ స్టార్ కృష్ణ ని వివాహం చేసుకున్న తరువాత అతని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందట. “మేం వెళ్ళిన చోట ఎక్కడైనా ఆడవారు కనిపిస్తే వెంటనే కృష్ణకి కూలింగ్ గ్లాసెస్ వేసేస్తాను” అని చెప్పారు. ఎందుకంటే కృష్ణ వేరే ఆడవారి కలలోకి సూటిగా చూడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారట.
“ఆయన వారి కళ్ళల్లోకి నేరుగా చూడలేరూ అందుకే కూలింగ్ గ్లాస్ పెట్టేదాన్ని” అని చెప్పారు. అంతేకాకుండా ఒకసారి చెన్నై లో మీసాల కృష్ణుడు దేవాలయంలో ఒక పాటకి షూటింగ్ పూర్తి చేసుకొని బయటకి వస్తుండగా గుడి బయట ఉన్న కమెడియన్ రాజబాబు తమ ఇద్దరిని చూసి.. ‘ఇది ఒక పవర్ ఫుల్ టెంపుల్. ఇక్కడ షూటింగ్‌లో పెళ్లి చేసుకున్న వారంతా తరువాత నిజం గానే పెళ్లి చేసుకున్నారని ఎవరో జోష్యం చెప్పారు’ అని అన్నారట. అయితే ఆ జోష్యం తమ విషయంలో నిజమైందని విజయాన్ని నిర్మల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.