బిరుదులు మార్చుకున్న టాలీవుడ్ హీరోలు… చిరంజీవి నుండి బన్ని వరకు, ఏవంటే?

బేసిగ్గా సినిమా వాళ్లకు వారి వారి సినిమాలు బాగా వాడినపుడు ముఖ్యంగా సినిమా హీరోలకు బాగా పేరు వస్తుంది. దాంతో జనాలు నీరాజనాలు పడతారు. ఓ రకంగా ఈ ఫ్యాన్స్ గ్రూప్స్ అనేవి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళను చేస్తాయి. వారే మాస్ హీరోలుగా పిలవబడతారు. తెలుగులో ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటివారు మాస్ హీరోలుగా వెలుగొందుతున్నారు. వీళ్ళ సినిమాలు రిలీజైతే థియేటర్లలో రచ్చ జరగాల్సిందే. ముఖ్యంగా అభిమానులు తమ తమ అభిమాన హీరోలను బిరుదులతోనే ఎక్కువగా పిలుస్తుంటారు.

మనవాళ్ళు ఊరుకుంటారా? దాన్నే టార్గెట్ గా చేసుకొని ఎవరికి వారు బిరుదులు ఇచ్చేసుకుంటారు. అయితే ఇందులో కొన్ని బిరుదులు సదరు హీరోలకు సరిగ్గా సూట్ అయితే, మరికొందరికి ఆయా బిరుదులు వున్నాయన్న సంగతి కూడా తెలియకుండా పోతుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే వారి ఇమేజ్ కాస్త ఎక్కువగా పెరుగుతున్న క్రమంలో కూడా పాత బిరుదులు స్థానంలో కొత్త బిరుదులు వచ్చి చేరుతాయి. ముందుగా మన మెగాస్టార్ ని తీసుకుంటే.. మొదట ఆయన్ని అందరూ ‘సుప్రీం హీరో’ అని అనేవారు. తరువాతి కాలంలో ‘మెగాస్టార్’ అయ్యారు.

తరువాత బాలయ్యని తీసుకుంటే మొదట ఇతన్ని ‘యుగాస్టార్’ అని పిలిచేవారు. తరువాతి కాలంలో నందమూరి అభిమానులు అతన్ని ‘నట సింహం’ చేసారు. ఇక రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారిన సంగతి తెలిసినదే. పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ అయ్యాడు. అలాగే అక్కినేని నాగార్జున ‘యువసామ్రాట్’ కాస్త ‘కింగ్’గా మారింది. అలాగే మహేష్ బాబు ‘ప్రిన్స్’ కాస్త ‘సూపర్ స్టార్’ అయింది. ప్రభాస్‌ ‘రెబల్ స్టార్’ బిరుదు ‘డార్లింగ్’ అని, రవితేజ ‘మాస్ హీరో’ ‘మాస్ మహారాజ్’ అని మారడం అందరికీ తెల్సిందే.

Share post:

Latest