ఆ పాపం తగ్గించుకోవడానికే ఆ హీరోయిన్ తో సినిమా.. ప్రభాస్ నిర్ణయం వెనుక ఇంత బాధ దాగుందా..?

రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు . పెదనాన్న కృష్ణంరాజు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ..ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . మొదటి సినిమాతోనే మాస్ టచ్ ని అభిమానులకు రుచి చూపించిన రెబెల్ హీరో ..ఆ తర్వాత క్లాస్, మాస్ తేడా లేకుండా హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలకు కమిట్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు .

కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ప్రభాస్ ఎక్కువ సినిమాల్లో నటించి రికార్డ్ నెలకొల్పాడు. కెరియర్ లో ఎవ్వరు చేయని విధంగా బిగ్గెస్ట్ రిస్కులు చేస్తూ స్టార్ హీరో గా మారిపోయాడు . వ్యక్తిగతంగా ప్రభాస్ చాలా సాఫ్ట్ మైండ్.. తను నమ్మి నష్టపోయిన వాళ్లకి ప్రభాస్ ఏదో ఒక విధంగా తనకు చేతనైన సహాయం చేస్తాడు . అలాంటి పనిని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రాధే శ్యామ్ సినిమాలో తారా క్యారెక్టర్ నటించిన రిద్ది కుమార్ గుర్తుంది కదా. ట్రైన్ లో ప్రభాస్ జాతకం చెప్తాడు ..ఆ తర్వాత ఆమె చేయి పోతుంది .. ఈ కారణంగా ఆమె చేయాలనుకున్న పనులు చాలా ఆగిపోతాయి .

రాధే శ్యామ్ సినిమాలో హీరోయిన్ కి మించి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన తార క్యారెక్టర్ ను ఇప్పుడు మరోసారి జనాల ముందుకు తీసుకురాబోతున్నాడు ప్రభాస్ . మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో మూడో హీరోయిన్ గా రిద్ది కుమారుని సెలెక్ట్ చేసుకున్నాడు ప్రభాస్. ఇదే న్యూస్ గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి రాధేశ్యామ్ సినిమాలో తారా క్యారెక్టర్ చాలా హిట్ అవుతుందని ప్రభాస్ అనుకున్నారట. షూటింగ్ టైం లోను అమ్మడుకు అదే చెప్పుకొచ్చారట.

అయితే సినిమా రిలీజ్ అయ్యాక కధ వేరేలా ఉండింది. దీంతో తారా క్యారెక్టర్ చెప్పుకో తగ్గ క్రేజ్ తెచ్చుకోలేకపోయింది . ఈ క్రమంలోనే ఆమెకు మరో అవకాశం ఇవ్వడానికి ప్రభాస్ .. మారుతి సినిమాలో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే తనని నమ్మి నష్టపోయిన వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు ప్రభాస్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు . ఈ సినిమా హిట్ అయితే అమ్ముడు జాతకం మారిపోతుందనడంలో సందేహం లేదు.

Share post:

Latest