అచ్చ తెలుగు సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ఈ తరానికి పరిచయం చేయాల్సిన పనిలేదు. అతని సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఎందుకంటే సున్నితమైన భావోద్వేగాలు తెరపై ఆవిష్కరించడంలో శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. దాదాపు ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలన్నీ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం విశేషం. శేఖర్ కమ్ముల ఎంచుకునే కథలు మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మన చుట్టుపక్కల జరిగే కథల ఆధారంగానే శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి. అందుకే జనాలు బాగా కనెక్ట్ అవుతారు.
ముఖ్యంగా ఈయన సినిమాల్లోని హీరోయిన్లు మన పక్కింటి అమ్మాయిల్లానే కనబడతారు. ఆనంద్ నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన లవ్ స్టోరీ వరకు ప్రతి సినిమా చూసుకోండి. చాలా సింపుల్ గా అందంగా చిత్రీకరిస్తారు. ఇక అసలు విషయానికొస్తే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా గురించి అందరికీ తెలిసినదే. మన మధ్య జరిగే కొన్ని అందమైన ప్రేమకథలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు శేఖర్. ఈ సినిమాలో జంటగా నటించిన అభిజిత్ – షగున్ కౌర్ అందరికి గుర్తుండే ఉంటారు.
ఈ సినిమా తర్వాత ఆ హీరోయిన్ ఎందుకోమరి కనిపించలేదు. సినిమాలు కూడా చేసిన దాఖలాలు లేవు. షగున్ కౌర్ పద్మావతి అనే క్యారెక్టర్లో సూపర్బ్ గా నటించింది. దాంతో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ సినిమా చేసిన వెంటనే షగుణ్ కౌర్ పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైంది. లా చదివి లాయర్ గా సెటిల్ అయ్యిందని సమాచారం. ఏది ఏమైనా చేసిన ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల మనసు కొల్లగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.