సూపర్ స్టార్ కృష్ణ మరణానికి అసలు కారణం ఇదే.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు..!!

సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారని కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. కార్డియాక్ అరెస్ట్‌తో నిన్న తెల్లవారుజామున కృష్ణ తమ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ఆ టైం కి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు.. ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంటనే ఎమర్జెన్సీ వైద్యం అందించి, ఆ తర్వాత ఐసీయూలో జాయిన్ చేశామన్నారు. ఆ తర్వాత రెండు మూడు గంటల సమయంలోనే ఆయన శరీరంలోని మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని.. ఆ తర్వాత నాలుగు గంటల సమయం తర్వాత ఆయనకు డయాలసిస్ కూడా చేశామని వెల్లడించారు.

అప్పటినుంచి మా డాక్టర్ లు అందరు గంటకు ఓ సారి కృష్ణ గారి ఆరోగ్యం పై ఆయన కుటుంబ సభ్యులకు అప్డేట్ ఇస్తూనే వచ్చాము.. ఎంతో మెరుగైన వైద్యం అందించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని, ఈ విషయం మేము నిన్న సాయంత్రమే చర్చించుకున్నామని తెలిపారు.

నిన్న రాత్రి 7 గంటలకు కృష్ణ ఆరోగ్య పరిస్థితి చాలా విషమించిందని వైద్యులు అన్నారు. అప్పటికే కృష్ణ బ్రెయిన్ పూర్తిగా డామేజ్ అయిందని, ఆయన శరీరంలో ఉన్న మిగతా అవయవాలు కూడా సరిగ్గా పనిచేయడం మానేశాయని. దీనివల్ల చికిత్స చేసిన ఆయన శరీరం స్పందించలేదని చెప్పుకొచ్చారు. చివరి క్షణాల్లో కృష్ణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నామన్నారు. ఇక ఈరోజు ఉదయం 4:07 గంటలకు కృష్ణ గారు మరణించారని డాక్టర్లు తెలిపారు.

Actor Krishna Dies: Mahesh Babu's father passes away; he lost his mom &  brother earlier this year | Entertainment News – India TV

మేము అందరం ఎంత ప్రయత్నించినా ఒక వ్యక్తి ప్రాణాలతో ఉండడని తెలిసినప్పుడు.. వైద్య నీతిలో భాగంగా ఆ వ్యక్తికి వైద్యం అందించకుండా ప్రశాంతంగా ఉంచుతాం.. కృష్ణ గారి విషయంలో కూడా మేము అదే చేశామని ఆయన వెల్లడించారు. కృష్ణ గారు ఎంతో గొప్ప వ్యక్తి ఆయనని లాంటి వ్య‌క్తి మన మధ్య లేకపోవడం బాధాకరం. కృష్ణ గారు మా ఆసుపత్రిలో 9 సంవత్సరాలుగా.. మా దగ్గర చికిత్స చేయించుకుంటున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు కూడా మా హాస్పటల్ లోనే వైద్య సేవలు తీసుకుంటున్నారు.. డాక్టర్లుగా కృష్ణ గారికి సేవలు అందించినందుకు తాము గర్వపడుతున్నామని వారు చెప్పుకొచ్చారు.

Share post:

Latest