తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట హీరో నితిన్ తో కలిసి జయం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని సదా చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయని చెప్పవచ్చు. మొదటి చిత్రంతోనే తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన సదా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది టాలీవుడ్లో. ఇక తర్వాత కొన్ని సంవత్సరాలకు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు.
సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు తనకు సంబంధించిన పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తన వ్యక్తిగత బంధాల పైన కూడా సదా ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.. “మనలో చాలామంది వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోతూ ఉంటారని భయపడుతుంటారు మీ ఎదుగుదలకు అడ్డు వచ్చే వ్యక్తులను కచ్చితంగా మీరు తిరస్కరించడమే మంచిది.. ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్నవారు ఇప్పుడు ఒక్కసారిగా మీకు సహకరించలేదు అంటే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని.. మన జీవితంలోకి రకరకాలైన మనుషులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు.. కానీ చివరి వరకు మనతో ఉండేది మనమే అంటూ రాసుకుంటూ జీవితం చాలా చిన్నది బలవంతంగా బంధాలలో ఉండడం కంటే ఒంటరిగానే ఉండడం సంతోషంగా ఉంటుంది అంటూ తెలియజేసింది సదా.
ప్రస్తుతం సదా వయసు 38 సంవత్సరాలు ఇంకా ఈమె వివాహ ఊసే ఎత్తలేదు.. దీంతో సదా పైన పలు రకరకాలుగా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ షేర్ చేయడంతో అందరూ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.<
View this post on Instagram
/p>