పిల్లలకు హిందూ దేవుళ్ల పేర్లు పెట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు వీరే!

బేసిగ్గా మనం చిన్నపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు చాలా ఆచి తూచి వ్యవహరించి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా మన తాతలకాలం నుండి కూడా పిల్లలకు దేవుళ్ళ పేర్లనే పెడుతూ ఉంటాము. అలాగే కొంతమంది ఆనవాయితీగా కుల దేవతలు, గ్రామదేవతల పేర్లు పెడుతూ వుంటారు. అయితే ఇది సామాన్యులకు కాదండోయ్. మనం సెలబ్రిటీలు అని చెప్పుకొనే వారు కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతూ వుంటారు. బాలీవుడ్లో చూసుకుంటే ఈమధ్య కాలంలో కొంతమంది నటీమణులు వాళ్ళ పిల్లలకు దేవతల పేర్లనే విధిగా పెట్టుకోవడం మనం గమనించవచ్చు.

తాజాగా అలియా భట్ , రణబీర్ కపూర్ జంట తమ కుమార్తె పేరును ‘రాహా’ అని ప్రకటించారు. దీనికి అతీంద్రియ మార్గం అని అర్ధం వస్తుంది. అంటే దేవుని మార్గం అని మాట. అలాగే బాలీవుడ్‌లో మరో సెలబ్రిటీ జంట… అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ గత ఏడాది తమ కుమార్తెకు ‘వామిక’ అని పేరు పెట్టడం మీకు తెలిసిందే. వామిక అంటే – దుర్గామాత రూపం అని అర్థం. అలాగే ఈ నవంబర్ 12న బిపాసా బసు ఓ కుమార్తెకు జన్మనివ్వగా కూతురికి ‘దేవి’ అని పేరు పెట్టారు. ఇక ఆగస్టు 20న సోనమ్ కపూర్ కుమారుడిని కనగా ఆ బిడ్డకి ‘వాయు’ అని పేరు పెట్టారు.

అలాగే ఈ ఏడాది ప్రారంభంలో ప్రియాంక చోప్రా – నిక్ జోనాస్ తమ కుమార్తెను సరోగసీ ద్వారా కన్న విషయం విదితమే. కాగా ప్రియాంక మరియు నిక్ తమ కుమార్తెకు ‘మాల్తీ మేరీ చోప్రా జోనాస్’ అని పేరు పెట్టారు. ఇక మాల్తీ అంటే భగవంతునికి అర్పించే పూల సువాసన అని అర్థం వస్తుంది. అలాగే మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుమార్తె పేరు ఆరాధ్య అని తెలిసినదే. అలాగే మరో నటి శిల్పా తన పెద్ద కుమారుడికి శ్రీకృష్ణ అని, చిన్న కొడుకు పేరు వియాన్ అని పేరు పెట్టారు.

Share post:

Latest