కోలీవుడ్ సూపర్ యాక్ట్రెస్ నయనతార గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట రజని సినిమా ‘చంద్రముఖి’తో పరిచయం అయిన నయన్ అనతికాలంలోనే సూపర్ స్టార్ రేంజ్ ని సొంతం చేసుకుంది. చూడచక్కని అందం, మంచి అభినయంతో నయన్ తమిళ తంబీల హృదయాలను కొల్లగొట్టింది. హీరోయిన్ నమ్రత తరువాత ఆ రేంజ్ సంపాదించుకున్నది ఒక్క నయన్ మాత్రమే. ఇక నయన్ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఒడిదుడుకులతో సాగింది. పలుమారు ప్రేమలో విఫలమైన తరువాత నయన్ తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని పెళ్లిచేసుకుంది.
కొన్నాళ్ల క్రితమే మహాబలేశ్వరంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. కాగా ఇటీవలే సరోగసీ పద్దతిలో పేరెంట్స్ అయ్యామంటూ వారు చేసిన ప్రకటన వివాదాస్పదమైన విషయం కూడా తెలిసినదే కదా. కాగా వారు ఆ వివాదం నుండి బయటపడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ మూవీ జవాన్ తో పాటు నాలుగు తమిళ చిత్రాలు చేస్తుండటం విశేషం. ఇక అసలు విషయానికొస్తే నయన్ అత్త, విఘ్నేష్ తల్లి ఆమెని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ఈ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అవును, కొత్త కోడలు నయనతారపై అత్త ప్రశంసలు కురిపిస్తోంది. నయనతార చాలా దయా హృదయం కలిగిన అమ్మాయి అని చెప్పుకొచ్చారు. విషయం ఏమంటే, వాళ్ళ ఇంట్లో దాదాపు 8మంది వర్కర్స్ పనిచేస్తారట. వారిలో ఒకరు రూ. 4 లక్షల అప్పు తీర్చలేక నానా యాతన పడుతుంటే ఆ అప్పుని నయనతార తీర్చిందని, చెప్పుకొచ్చారు. ఇకపోతే నయనతారకు ఇల్లును చక్కబెట్టడం, పెద్దవారి ఆలనా పాలనా, క్షేమం చూసుకోవడం బాగా తెలుసట. 10 మంది మనుషులు చేసే పని నయనతార ఒక్కతే చేసేస్తుందట. “మేము మా పిల్లలకు కష్టపడటం నేర్పాము. నయనతార కూడా అలాగే కష్టపడటం తెలిసిన అమ్మాయి.” అని అత్త తెగ మురిసిపోతోంది భోగట్టా.