బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాల తర్వాత నుండి ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ సరైన హిట్ అందుకోలేకపోయాడు. ప్రభాస్ వరుసగా రెండు అపజయాలు వచ్చినా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అందరి చూపు కే జి ఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న సలార్ సినిమా పైనే ఉంది.
ఈ సినిమాతో పాటు ప్రభాస్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపైనే ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ గత కొంతకాలంగా తాను ఎక్కడ కనిపించినా తన తలకు క్యాప్ పెట్టుకుని కనిపిస్తుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభాస్ క్యాప్ పెట్టుకుని కనిపించడంతో ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తాను ఏ ఫంక్షన్ కి వెళ్లిన తలకు క్యాప్ లేకుండా ప్రభాస్ వెళ్ళడం లేదు. ప్రభాస్ క్యాప్ పెట్టుకోవడానికి ఇదే కారణమని సోషల్ మీడియాలో ఎన్నో రూమార్లు కూడా వస్తున్నాయి. అయితే దానికి ప్రధాన కారణం ప్రభాస్ తాను నటించే సినిమాలలో తన లుక్ రివిల్ అవ్వకుండా ఉండడానికి తలకి క్యాప్ పెట్టుకుని కనిపిస్తున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ గతంలో తను నటించిన సినిమాల్లో జరిగిన పొరపాట్లు ఇప్పుడు తను నటించే సినిమాల్లో జరగకుండా ఉండటానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది.