యాక్టింగ్ తో పాటు ఆ విషయంలో ప్రాక్టీస్ చేస్తోన్న యాక్టర్లు వీరే!

ఎలాంటి చదువులు చదువుకున్న వాళ్ళకైనా ఒక్కసారి గ్లామర్ ప్రపంచం వైపు చూపులు వెళ్లాయంటే ఇంకా చదవడం కష్టం. అదేకాదు ఇంకేపని చేయాలన్నా వారు చేయలేరు. ఎలాంటి వృత్తులలో వారైనా ఒక్కసారి సినిమా పురుగు వారి మెదడులో దూరిందంటే ఇంకా కష్టం. అయితే ఎప్పుడు ఎవరికి టర్న్ వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో కేవలం సినిమాలనే కాకుండా ప్రొఫెషనల్ గా కూడా డిగ్రీ పట్టాలు అందుకున్నవారు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా కూడా వారి ఏదో ఒక కోర్స్ పూర్తి చేసి వస్తున్నారు.

మీరు వినే వుంటారు.. డాక్టర్ కాబోయే పొరపాటున యాక్టర్ అయ్యామని కొంతమంది చెబుతూ వుంటారు. అయితే ఈ విషయం కొంతమంది హీరోయిన్లలో నిజమైంది కూడా. ముఖ్యంగా మన సౌత్ భామలు చాలామంది యాక్టర్లుగానే కాదు డాక్టర్ కోర్స్ కూడా పూర్తి చేశారు. వారిలో ముందుగా చెప్పుకోబోయేది భానుమతి ఒక్కటే పీస్ అంటూ తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన సాయి పల్లవి గురించి చెప్పుకోవాలి. ఆమె ఒక పక్క సినిమాలు చేస్తూ మరోపక్క MBBS పూర్తి చేసింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఓ పక్క ఫామిలీ డాక్టర్ అవతారం ఎత్తింది. అదేనండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా బాగోపోతే ఆమే చూసుకుంటుంది.

అలాగే ఈ కోవకు చెందిన మరో భామ ఐశ్వర్య లక్ష్మి కూడా వైద్య విద్యలో పట్టా పుచ్చుకుంది. ఈమధ్యనే అమ్ము పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఐశ్వర్య లక్ష్మి. అలాగే అందాల తార అదితి కూడా MBBS పూర్తి చేసింది. కేవలం హీరోయిన్ గానే కాదు సింగర్ గా కూడా అదితి అదరగొడుతుంది. అలాగే త్వరలో తెలుగు తెరపై మెరవనున్న మిస్ యూనివర్స్ ‘మానుషి చిల్లర్’ కూడా వైద్య విద్యను పూర్తి చేసింది. బాలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా ఇప్పటికే పలు సినిమాలు చేసింది.

Share post:

Latest