ప్రముఖ బుల్లితెర స్టార్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రష్మీ ఓ వైపు బుల్లితెర మరోవైపు వెండితెర అంటూ మంచి బిజీగా గడుపుతోంది. అయితే రష్మీ అందరిలాగా కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. సామాజిక సేవలోనూ కూడా తనవంతుగా ముందుంటుంది. ముఖ్యంగా రష్మీ జంతు ప్రేమికురాలు అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు పక్షులు,జంతువుల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెడుతూ తన అభిమానులకు అవగాహన కలిగిస్తూ ఉంటుంది.
మూగజీవాలను ఎవరైనా హింసిస్తే.. సోషల్ మీడియా వేదికగా వారిని కడిగి పారేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. రష్మీ గౌతమ్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కొందరు యువకులు మద్యం పార్టీ చేసుకున్నారు. అదే సమయంలో ఓ కుక్కపిల్ల అటుగా రావడంతో.. దానికి కూడా ఓ గ్లాస్లో మందు పోశారు. ఆ విషయం దానికి ఏం తెలుసు? ఏమీ తెలియని ఆ మూగజీవం.. మందు తాగింది. ఆ తర్వాత మత్తులో తూలుతూ నడవలేక కిందపడిపోయింది. ఈ మొత్తాన్ని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఆ దృశ్యాన్ని చూసి తల్లడిన రష్మీ ఆ వీడియోను చూసి ఆమె చలించిపోయి, అలా చేసినవారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేసింది. ఆ కుక్కపిల్లకు మందు ఎవరు పోశారో కనిపెట్టాలని.. వారితో పాటు దానిని కామెడీ చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేయాలని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఈ పోస్టుని చూసిన నెటిజన్లు కూడా కుక్క పిల్లకు మద్యం పోసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూగజీవాల సంరక్షణ కోసం సోషల్ మీడియా వేదికగా రష్మీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు.