తొలి యవ్వన దశలో మొగ్గ తొడిగిన ప్రేమ ఎలా ఉంటుందో దాదాపు అందరూ రుచి చూసే వుంటారు. అయితే అదే విషయం సెలిబ్రిటీల విషయానికి వచ్చినపుడు ఆ విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కుతూహలం చెందుతూ వుంటారు. అయితే ఇలాంటి విషయాలు చాలామంది బయటకి చెప్పకపోయినప్పటికీ కొంతమంది నటీమణులు మాత్రం బాహాటంగానే ఆ విషయాలను గురించి మీడియా ముందు చెప్పడం విశేషమనే చెప్పుకోవాలి. తొలి క్రష్ కి సామాన్యులు మాన్యులు అనే తేడా ఏమీ లేదు.
తాజాగా నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కేలో నటిస్తున్న దీపిక పదుకొనే గురించి ప్రభాస్ క్రష్ విషయం బయట పెట్టాడు. తనకు దీపిక అంటే చాలా ఇష్టం అని, ఓం శాంతి ఓం సినిమా చూసినప్పుడే పడిపోయాను అని డార్లింగ్ చెప్పుకొచ్చాడు. అలాగే తాజాగా ఝలక్ దిఖలాజా- 10 వేదికపైకి విక్కీ కౌశల్ మాట్లాడుతూ ఏమాత్రం తటపటాయించకుండా ‘మాధురీ దీక్షిత్’ తన మొదటి క్రష్ అని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా సీనియర్ నటితో ముచ్చటగా డ్యాన్స్ కూడా చేసి అభిమానులు అలరించాడు.
ఇక కాఫీ విత్ కరణ్ లో సారా అలీ ఖాన్ కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసినదే. అలాగే సారా అలీఖాన్ తన డెబ్యూ చిత్ర కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తోను కొద్దిరోజుల పాటు డేటింగ్ చేసిన సంగతి విదితమే. అలాగే కింగ్ ఖాన్ షారూక్ కొడుకు ఆర్యన్ ఖాన్ పై అనన్య పాండే క్రష్ ఈమధ్యకాలంలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’లో అనన్య పాండే తన చిన్ననాటి స్నేహితుడు ఆర్యన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నానని చెప్పడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఇక బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ పై తన తొలి క్రష్ గురించి సమంత రూత్ ప్రభు నిష్కల్మషంగా ఓపెనైంది.