తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున భార్య అమల ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అక్కినేని కుటుంబంలోకి అడుగు పెట్టడంతో ఈమె బాగా పాపులర్ అయింది. అయితే ఒకప్పుడు అమల అనేక తెలుగు తమిళ్, కన్నడ, మలయాళం వంటి సినిమాలలో దాదాపుగా 50కు ఫైగా చిత్రాలలో నటించింది. అమల ఎక్కువగా తమిళ సినిమాలోనే నటించింది. అమల పుట్టింది పెరిగింది మొత్తం కేవలం కోల్కత్తాలోనే. ఈమె తండ్రి కూడా ఒక నేవీ ఆఫీసర్. తల్లి మాత్రం ఒక గృహిణి.
ఇక తన తండ్రి ఉద్యోగరీత్యా మద్రాసుకి షిఫ్ట్ కావడంతో అమల కూడా అక్కడే భారత నాట్యంలో శిక్షణ తీసుకున్నదట. అమలకు ముఖ్యంగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ఇక ఈమె తమిళంలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వగా తెలుగులో మాత్రం నాగార్జున సరసన కిరాయి దాదా అనే సినిమాలో నటించింది. నాగార్జునతో పరిచయం కాస్త ప్రేమగా పారి పెళ్లికి దారి తీసింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే తమిళంలో 30 కి పైగా సినిమాలలో నటించిన అమల అయితే వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే ఒక సినిమా ద్వారా అమల పెద్ద వివాదంలో చిక్కుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
ఇక మొదటి నుంచి తమిళ్ లకు ద్రావిడ సంస్కృతి అంటే మహా అభిమానం అందుకే చాలామంది తమిళ్ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు చాలా చురుకుగా పాల్గొనేవారు. అలా భారతిరాజ దర్శకత్వంలో వచ్చిన వేదం పుదీదు అనే సినిమా.. తెలుగులో వైదేహి పేరుతో కూడా డబ్ చేయబడింది. ఈ సినిమా బ్రాహ్మణ కు వ్యతిరేకంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో అమల హీరోయిన్గా సత్యరాజ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో బ్రాహ్మణి స్త్రీ పాత్రలో అమల నటించడంతో అప్పట్లో బ్రాహ్మణుల వత్తిడి వల్ల ఈ సినిమాని బ్యాన్ చేశారు. ఒక బ్రాహ్మణ అమ్మాయి ఒక సాధారణ మనిషిని ప్రేమించి కథా అంశంతో తెరకెక్కించారు అయితే ఈ విషయాన్ని మాత్రం అక్కడ బ్రాహ్మణులు ఒప్పుకోలేదా దీంతో అప్పట్లో ఈ విషయం తన సంచలనాన్ని సృష్టించిందట.