ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో కే జి ఎఫ్ చిత్రం కూడా ఒకటి. ఇక ఏడాది కేజిఎఫ్-2 విడుదల ఇప్పటికి ఐదు నెలలు కావస్తున్నా ఇంకా ఈ సినిమాలో నటించిన హీరో యష్ ( రాఖీ బాయ్ )కూడా అదే లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక తన తదుపరిచిత్ర విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ యష్ మాత్రం ఇంకా సరైన కథ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే కే జి ఎఫ్ -3 కి సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఇక ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు యష్. యష్ తదుపరి చిత్రం కూడా కేజిఎఫ్ -3 అన్నట్లుగా కోలీవుడ్లో చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఆల్రెడీ హీరో కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పార్ట్ 3 కి ఇంకా సమయం ఉందనే విషయాన్ని కూడా తెలియజేశారు. కానీ నిర్మాతలు మాత్రం కేజిఎఫ్ 3 కి గ్రాండ్ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కే జి ఎఫ్ సినిమాకు ముందు అనుకున్న కథ వేరు పీరియాడికల్ ఎలివేషన్స్ కి మిక్స్ చేస్తూ కాస్ట్యూమ్ డ్రామాగా ఒక కథను సిద్ధం చేశారట.
అయితే ప్రశాంత్ నీల్ ,యష్ ఐడియా తో పూర్తి కథను పక్కనపెట్టి అందులో కొంత భాగాన్ని మాత్రమే రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ రెండు భాగాలు మంచి విజయం కావడంతో మిగతా కథను కూడా మూడో భాగంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది మేకర్స్. ఇక గతంలో పక్కన పెట్టిన ఆ కథ నే.. ఇప్పుడు మరొకసారి వర్క్ చేసి ఆ కథతో సినిమా చేయాలని ఆలోచనలు చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో యష్ రాజుగా కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.