టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా పేరు పొందారు కృష్ణ. ఇక ఎంతో టెక్నాలజీని కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అయితే నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి చేరిన కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం.
అనారోగ్య సమస్యతో దాదాపుగా 80 ఏళ్ల వయసులో కృష్ణ గారు కన్నుమూయడం జరిగింది. నిన్నటి రోజున కాంటినెంటల్ ఆసుపత్రిలో కృష్ణ అడ్మిట్ అవ్వడం జరిగింది. శరీరంలో ప్రధానమైన అవయవాలు ఏవి పనిచేయలేనందువలన వైద్యులు కృష్ణ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. దీంతో కృష్ణ కోలుకోలేదని చెప్పవచ్చు. వైద్యానికి శరీరం సరిగ్గా స్పందించలేదని నిన్నటి రోజున కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషయంగానే ఉందని వైద్యులు తెలియజేయడం జరిగింది. దాదాపుగా 48 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని తెలియజేశారు. కానీ అంతలోనే కృష్ణ మరణ వార్త అటు అభిమానులలో ఇటు ప్రేక్షకులలో ఈ విషయం తెలియగానే కన్నీరు మున్నేరు అవుతున్నారు.
ఇక మహేష్ బాబు తన తండ్రి మరణ వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు . ఇక గడిచిన కొద్ది రోజుల క్రితమే మహేష్ బాబు తల్లి కృష్ణ భార్య ఇందిరా దేవి మరణ వార్త మరువకముందే ఇప్పుడు తన తండ్రి మరణ వార్తతో మహేష్ బాబు అభిమానులు కూడా చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నారు.