టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరైన సమంత గడచిన కొద్ది రోజుల క్రితం మయోసైటీస్ అనే వ్యాధిన బాధపడుతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సైతం సమంత ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని పలు రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. అయితే గడిచిన రెండు రోజుల క్రితం నుంచి సమంత పరిస్థితి విషయంగా ఉందని హాస్పిటల్ లో చేర్చారని కోలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సమంత పరిస్థితి అసలేం బాగోలేదని వార్తలు వైరల్ గా మారాయి.
దీంతో సమంత పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే విధంగా తాజాగా దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చారు సమంత కుటుంబ సభ్యులు, సమంత మేనేజర్. సమంత ఆరోగ్య పరిస్థితి విషయమంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు రావడంతో అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చారు.. సమంత క్షేమంగానే ఇంట్లో ఉన్నదని సమంత కుటుంబ సభ్యులు కూడా తెలియజేసినట్లు సమాచారం. అయితే సమంత మేనేజర్ కూడా ఈ విషయాన్ని తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత ఆరోగ్యం గానే ఉంది ఇదివరకే సమంత వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోలు మీరు చూశారు కదా అని తెలియజేస్తున్నాను.
దీంతో కొంతమంది నేటిజన్స్ సమంత అభిమానులు మాత్రం కోలీవుడ్ మీడియా పై ఫైర్ అవుతున్నారు. సమంత ఆరోగ్యం గా ఉందని తెలిసి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సమంత సినిమాల విషయానికి వస్తే తను నటించడం లేదు చిత్రం యశోద విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ఈమె నటించిన శాకుంతలం, ఖుషి సినిమాలు త్వరలోనే విడుదల విడుదల కాబోతున్నాయి.