కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సునైనా. మొదటి సినిమాతో ఈమెకు అంతగా గుర్తింపు తెచ్చుకో లేకపోయినా.. తర్వాత యువ హీరో శ్రీ విష్ణుకు జంటగా రాజరాజ చోర సినిమాతో మరోసారి టాలీవుడ్‌ను పలకరించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో పాటు సునైనా కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు నటిస్తుంది.
సునైనా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తనకు సంబంధించిన ఏ విషయామైనా సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంది. ఆ సందర్భంలో ఈమె ప్రేమ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది.
సోషల్ మీడియా వెదికగా తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న సునైనా.. అంతలో ఓ అభిమాని మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగగా ఆ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ఇప్పటికీ కూడా బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు అంటూ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత మీ దృష్టిలో విజయానికి నిర్వచనం ఏమిటి… అని అడగగా.. మీకోసం మీరు ఏమి కోరుకుంటున్నారో అదే మీ సంతోషాన్ని ఇస్తుందంటూ సమాధానం ఇచ్చింది.
అలాగే మీరు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారని అడగగా.. ఈమధ్య కాలం నుంచే పుస్తకాలు చదవడం ప్రారంభించాను.. పుస్తకం చదవడం వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో మంచి సినిమాలు వస్తే చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన వండర్ ఉమెన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. వీటితో పాటు విశాల్ హీరోగా నటించిన లాఠీ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది.
Let me recover from the last heartbreak 😊 https://t.co/s8GC81iLpO
— SUNAINAA (@TheSunainaa) November 16, 2022
Yes yes, #meetcute… #laatti and #regina ❤️ https://t.co/ZWX6KlSEFw
— SUNAINAA (@TheSunainaa) November 16, 2022