సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో చిత్రాలలో కౌబాయ్ గెటప్పులలో నటించడం మనం చూసే ఉన్నాము. మొదట ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే చిత్ర నేపథ్యంలో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. ఇక తర్వాత మహేష్ బాబు కూడా టక్కరి దొంగ సినిమాలో కౌబాయ్ గెటప్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కౌబాయ్ అనగానే తల మీద టోపీ గుర్రంపై స్వారీ చేస్తూ నడుము దగ్గర తుపాకీ పెట్టుకొని సినిమాలలో కనిపించడం మనం చూసే ఉంటాము. వాస్తవానికి కౌబాయ్ అలాగే ఉంటారా వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కౌబాయ్ అంటే పశువుల కాపరి అని అర్థం. అమెరికాలో గడ్డి భూములు గుర్రంపై స్వారీ చేస్తే పశువులను మేపుతూ ఉండేవారిని కౌబాయ్ గా పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ప్రత్యేకించి అమెరికా ఆస్ట్రేలియాలో పశువుల నిర్వాహకుల కోసం కౌబాయ్ లను నిర్మిస్తూ ఉంటారు. కౌబాయ్ గా ఉండే వ్యక్తి శరీరం చాలా దృఢంగా ఉంటుందట. ఎలాంటి అంగవైకల్యం లేకుండా ఉండే కొంతమంది యువతులను 1900 సంవత్సరంలో గడ్డి భూముల పశువులను మేపడానికి వీరిని ప్రారంభించారట. అటు తరువాత 1903 లో ది గ్రేట్ ట్రైన్ రాబరీ అనే చిత్రం ద్వారా మొదటిసారి కౌబాయ్ చిత్రం రావడం జరిగిందట ఇక తర్వాత ఇండియాలో మొదటిసారి కృష్ణా నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం విడుదలైంది.
ఇక కౌబాయ్ పదం చరిత్ర ఇదే కౌబాయ్ అనే పదం గుర్రం ఎక్కి పశువులు కాసే వ్యక్తిని సూచించే పదం..కౌబాయ్ అనే పదం ఆంగ్ల పదం నుంచి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. బ్రిటిష్ దేవుళ్ళు 1820 నుంచి 1850 వరకు ఆవులను పోషించే యువకులను కౌబాయ్ గా పిలిచేవారు. అయితే ఆ తరువాత 1880లో కొన్నిచోట్ల కౌబాయ్ అనే పదాన్ని వివిధ నేరాలు చేసే వ్యక్తులుగా పిలిచేవారు ఆ తర్వాతే గుర్రపు దొంగ చట్ట విరుద్ధమైన వ్యక్తి అని సూచించడం జరిగిందట. ఇది కౌబాయ్ అనే వాటికి పూర్తి అర్థం.