అన్ స్టాపబుల్ లో రాజశేఖర్ రెడ్డి భజన అందుకేనా…బాలయ్య గేమ్ ప్లాన్ సూప‌ర్‌..!

సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఏ విషయం గురించి మాట్లాడిన ముక్కు సూటిగా కుండ బద్ద‌లు కొట్టినట్టు మాట్లాడతాడు. ఇక‌ రీసెంట్గా వచ్చిన అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో బాలకృష్ణ -వైయస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటం గురించి గీత కృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… ‘ఇతర రాజకీయ పార్టీల నాయకుల గురించి మంచిగా మాట్లాడితే మనకు మంచి పేరు వస్తుందని అందుకే బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడి ఉంటాడని గీతాకృష్ణ అన్నాడు’. ఈ క్రమంలోనే ‘బాలకృష్ణ జీవితంలో కాల్పుల కేసు విషయంలో రాజశేఖర్ రెడ్డి ఎంతో సహాయం చేశారని అందుకే బాలకృష్ణ ఇప్పుడు వైఎస్ఆర్ గురించి పాజిటివ్‌గా కామెంట్లు చేయడానికి ఇదే కారణమని ఆయన అన్నారు’.

 Geetha Krishna Shocking Comments Goes Viral In Social Media , Geetha Krishna, So-TeluguStop.com

అన్ స్టాపబుల్ తాజాగా వచ్చే ఎపిసోడ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గెస్ట్‌లుగా రాబోతున్నారు. ‘ఈ ఇద్దరు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు.. రాజశేఖర్ రెడ్డి కి ఎంతో మంచి సన్నిహితులు కావడంతో వారి ముందు బాలయ్య వైఎస్ఆర్ గురించి పాజిటివ్‌గా మాట్లాడటం వల్ల‌న రాజశేఖర్ రెడ్డి అభిమానులకు దగ్గర అవ్వాలని బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు’. జగన్ కూడా బాలకృష్ణకు అభిమాని అన్న విషయం మనకు తెలిసిందే. ‘బాలకృష్ణ అందరివాడు అనిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు. ఇక రాబోయే రోజుల్లో బాలయ్య అన్ స్టాపబుల్ షోకు మాజీ ఉపరాష్ట్రపతి సీనియర్ రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడు’ కూడా రాబోతున్నాడని గీతాకృష్ణ సెన్సేషనల్ కామెంట్లు చేశాడు.

Telugu Aha Ott, Balakrishna, Geetha Krishna, Tollywood, Unstopable, Ys Jagan-Mov

ఇక తన ప్రతిపక్ష నాయకుడి పై పాజిటివ్ కామెంట్లు చేయడం వల్ల‌న ఆయన రాజకీయ భవిష్యత్త్‌కు కూడా ఎంతో బాగుంటుందని.. ఆయనకు ప్లస్ అవుతుందని గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్ ఆహా ఓటీటీ వల్ల‌న బాలకృష్ణకు మంచి జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ షో వాళ్ళ బాలయ్య లో ఉన్న ఇంకో యాంగిల్ అందరికీ తెలిసిందని.. ఇక‌ దీంతో బాలయ్యకు యువతలో మంచి ఫాలోయింగ్ వచ్చింంది. ఈ షో వల్ల బాలయ్య అందరితో ప్రశంసలు అందుకుంటున్నారని గీతాకృష్ణ వెల్లడించారు. ఈ సీనియర్ దర్శకుడు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share post:

Latest