కృష్ణ మరణంతో మహేశ్ సంచలన నిర్ణయం..గుండె పగిలేలా ఏడుస్తున్న ఫ్యాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుస విషాద వార్తలు ఎక్కువగా వింటున్నం. గత కొంతకాలంగా సినీ ఫ్యామిలీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. కొందరు అనారోగ్య కారణంగా మరణిస్తుంటే ..మరి కొందరు వ్యాయామాలు చేసేటప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడంతో యంగ్ ఏజ్ లోనే ప్రాణాలను విడిచేస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ కి తీరని లోటుగా మిగిలిపోతుంది. కాగా రీసెంట్గా టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే.

వయసు మీద పడుతున్నా చాలా హెల్తీగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ.. గత కొన్ని నెలలుగా అనారోగ్య కారణంగా బాధపడుతున్నారు . ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయన కాంటినెంటల్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వెంటి లేటర్ పై తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలో ఘట్టమనేని ఫ్యాన్స్ ఆ వార్త విని తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. మరీ ముఖ్యంగా మూడు నెలల వ్యవధిలోనే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న మహేష్ బాబుని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు . మీడియా ముందే వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు వైరల్ గా మారాయి.

కాగా ఈ క్రమంలోనే మహేశ్ చాలా డిప్రెషన్ కి లోనైయ్యారు. కొన్నాళ్లు సినిమాలు ఆపేయాలని నిర్ణయించుకున్నాడట. దీంతో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ మహేష్ బాబుకు మేము ఉన్నామంటూ అండగా నిలిచారు . అంతేకాదు ఫ్యాన్స్ అయితే నీకు అమ్మానాన్న దూరమైన మేము ఉన్నాం అంటూ తండ్రి కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని క్రియేట్ చేశారు . ఈ వీడియోలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ లాగా ఉన్న ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబుని అటాచ్ చేస్తూ ..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో కొన్ని సీన్స్, సాంగ్స్, ఎక్స్ప్రెషన్స్ సింక్ అయ్యేలా ఘట్టమనేని ఫ్యాన్స్ ఒక వీడియోను క్రియేట్ చేశారు.

 

రెండు నిమిషాల 20 సెకండ్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇలాంటి మంచి నటుడుని కోల్పోయాం అంటూ బాధపడుతున్నారు . అంతేకాదు సే స్ట్రాంగ్ మహేష్ అన్న అంటూ ట్రెండ్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఎవరు ఎన్ని చెప్పినా సరే మహేష్ బాబు పడే బాధ వర్ణాతీతం.. ఎవరు తీర్చలేనిది.. పూడ్చలేనిది అన్నది సత్యం..!!