బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కిస్తున్న తమన్నా… కైపెక్కిన చూపులతో గుచ్చుతోంది చూడండి!

మిల్కి బ్యూటీ తమన్నా భాటియా గురించి నేటి కుర్రకారుకి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అమ్మడిని చూసి పాటలు పాడని కుర్రాళ్లే వుండరు. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కి చాలామంది ఫ్యాన్స్ వున్నారు. ఒక్క అబ్బాయిలేకాదు… అమ్మాయిలే కుళ్ళుకోనే సౌందర్యం తమన్నా సొంతం అని చెప్పుకోవాలి. తమన్నా దాదాపు దశాబ్ద కాలం నుండే ఇక్కడ తనదైన నటనతో, డాన్స్ తో అలరిస్తోంది. బడా హీరోల నుండి కుర్ర హీరోలైన, రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కూడా నర్తించింది. అంతేకాకుండా కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ లోనూ అలరిస్తోంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా డజనుకు పైగా సినిమాలతో అలరిస్తోంది. అలాగే తమిళంలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది తమన్నా భాటియా. వెండితెరపై అందాల విందుతో ఆడియెన్స్ ను కట్టిపడేసిన తమన్నా.. నెట్టింట కూడా తన మార్క్ ని వదలడం లేదు. గ్లామర్ షోతో కుర్రాళ్ళ సహనానికి పరీక్ష పెడుతోంది. ఫ్యాషన్ సెన్స్ ఈమెకి కాస్త ఎక్కువే అని చెప్పుకోవాలి. విమెన్స్ అమెరికన్ మంథ్లీ మ్యాగజైన్ ‘వోగ్ ఇండియా’ కోసం బ్లాక్ అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోషూట్ చేసింది.

ఈ నేపథ్యంలో బ్లాక్ డ్రెస్ లో మిల్క్ బ్యూటీ అందాలు మరింత అందంగా కనబడ్డాయి. స్రిప్ లెస్ డ్రెస్ లో టాప్ గ్లామర్ ను మెరిపిస్తూ పిచ్చెక్కిస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్రాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈమె సినిమాల విషయానికొస్తే తెలుగులో చివరిగా ‘ఎఫ్3’,‘గని’తో అలరించిన సంగతి విదితమే. కాగా కొన్ని సినిమాలు సెట్స్ పై వున్నాయి. హిందీలో ‘బబ్లీ బౌన్సర్’,‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’తో బి టౌన్లో కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో ఆడిపాడుతోంది.

Share post:

Latest