ఆహా షో కోసం సుధీర్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ .. జబర్ధస్త్ కి ట్రిపుల్..!!

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీ మిగతా వాటికన్నా డిఫరెంట్ గా టీవీ ఛానల్ తరహాలో రియాల్టీ షోలను ప్లాన్ చేస్తూ మంచి సక్సెస్ ను అందుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.` కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్` అనే పేరుతో ఓ కామెడీ షో అతి త్వరలో ఆహాలో ప్రసారం అవబోతోంది. అయితే ఈ కామెడీ షో లో ప్రముఖ కమెడియన్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు.

`జబర్దస్త్ షో` ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ బుల్లితెర పైనే కాకుండా వెండితెర పైన కూడా పలు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా మారాడు. అయితే ప్రస్తుతం ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ షో లో సుధీర్ యాంకర్ గా చేస్తున్నాడు. ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ కూడా అందుకుంది. అయితే ఈ షో కోసం సుధీర్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే జబర్దస్త్ అమౌంట్ కంటే ట్రిపుల్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే సుధీర్ ఒక్కో ఎపిసోడ్ కు 3 లక్షల రూపాయల రేంజ్ లో తన రెమ్యునేషన్ ఉంటుందని సమాచారం అందుతుంది.

అంతేకాకుండా సుధీర్ తో పాటు ఈ షోలో చాలామంది జబర్దస్త్ కమెడియన్లు కూడా ఉంటున్నారట. కానీ వారందరితో పోల్చి చూస్తే సుదీర్ మాత్రం భారీ మొత్తంలో రెమ్యూనేషన్ పుచ్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటివరకు సుధీర్ నటించిన సినిమాలలో ఏ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ను సాధించాలేకపోయింది. అయితే మళ్లీ సుధీర్ ఈ షో తో నైనా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని వారి అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ షో తోనైనా సక్సెస్ అవుతారో?లేదో? చూడాల్సి ఉంది.

Share post:

Latest