ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పొజిషన్ నడుస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఈరోజు కనిపించిన హీరోయిన్ రేపటి సినిమాలో కనిపించట్లేదు . ఒక సినిమాతోనే తట్టా బుట్టా సర్ధేసి వెళ్ళిపోతున్నారు హీరోయిన్స్ . అలాంటి టైం లో కూడా తమ హాట్ అందాలను వలకబోస్తూ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ టాప్ హీరోయిన్లుగా రాజ్యమేలుతున్నారు . మరీ ముఖ్యంగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి నెక్స్ట్ సినిమాకి కోట్లలో రెమ్యూనరేషన్ పెంచేసి సీనియర్ ముద్దుగుమ్మలకు సైతం దడ పుట్టిస్తున్నారు. వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కన్నడ పిల్ల శ్రీలీల.
ఇప్పటి వరకు చేసింది ఒక్కటంటే ఒక్కటే సినిమా . అది కూడా యావరేజ్ హిట్ . బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పలేం. అయినా కానీ అమ్మడు ఖాతాలో ఉన్న సినిమాల లిస్ట్.. రెమ్యూనరేషన్ ఎక్స్పెక్టేషన్ ఫిగర్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే . ప్రజెంట్ ధమాకా సినిమా కోసం శ్రీలీల దాదాపు రెండు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు త్వరలోనే మహేష్ బాబుతో కూడా ఓ సినిమాలో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కూతురుగా శ్రీలీల కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే .
కాగా ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్ చేసిన శ్రీ లీల రీసెంట్గా సైమా 2022 అవార్డ్స్ లో పుష్ప నుంచి క్రేజీ పాటకు డాన్స్ చేసింది. రష్మిక మందన కెరియర్ నే మలుపు తిప్పిన సామి సామి పాటకు శ్రీ లీల తనదైన స్టైల్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డాన్స్ చేసిన పద్ధతి కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. మరీ ముఖ్యంగా నా సామి అంటూ వచ్చినపుడుఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కుర్రాళ్ళు మర్చిపోలేకపోతున్నారు . ఈ క్రమంలోనే ఆ పాటను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు పుష్ప సినిమాలో రష్మిక కంటే శ్రీలీల ఉంటేనే బెటర్ అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి .
అసలకే ప్రజెంట్ రష్మిక ఎలాంటి పొజిషన్లో ఉందో తెలిసిందే. కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టి తో వివాదాల్లో మునిగిపోయింది . కన్నడ ఇండస్ట్రీ ఆమెని బ్యాన్ చేసే ఆలోచనలు ఉన్నాయి . ఇలాంటి టైంలో శ్రీల పుంజుకుంటే మాత్రం రష్మిక నెత్తిన తడబట్టేసుకుని ఇంట్లో కూర్చోవడమే బెటర్ అంటున్నారు సినీ విశ్లేషకులు . చూడాలి మరి ఇలాంటి ట్రోలింగ్ బాధల నుంచి రష్మిక ఎలా తప్పించుకుంటుందో . మళ్లీ తన పేరుని ఎలా టాప్ పొజిషన్లో ఉంచుకుంటుందో..!!