దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది శృతిహాసన్. కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో క్రేజ్ ను సంపాదించుకుంది శృతిహాసన్. తాజాగా శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించి ప్రస్తుతం సీనియర్ హీరోలతో పలు సినిమాలలో నటిస్తు బిజీగా ఉంది. ఒకవైపు తన సినిమా షూటింగ్లో బిజీగా ఉండడమే కాకుండా మరొకవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన, తన కుటుంబానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాయ్ కాట్ కూడ ఒకటి. ఈ మధ్యకాలంలో విడుదలైన ప్రతి సినిమా పట్ల బాయికాట్ విధించాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆన్లైన్ కల్చర్, బాయ్ కాట్ కల్చర్ గురించి శృతిహాసన్ స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ కేవలం చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రతి ఒక్కరంగంలో కూడా ఇలాంటిది ఉందని తెలియజేస్తుంది.
అయితే ఇలా ఎందుకు జరుగుతుందని విషయం గురించి తనకు ఇప్పటివరకు అర్థం కాలేదని.. అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా తెలియలేదని తెలిపింది. ఇలా బ్యాన్ చేయాలని కల్చర్ ఓ రకమైనటువంటి బెదిరింపు చర్యగా దాడి చేయడం లాంటిదని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ బాయ్ కాటు కల్చర్ మనం సినిమాలలోని చూస్తామని అయితే సినిమా ఇండస్ట్రీలో కన్నా ఎక్కువగా ఈ కల్చర్ బయట వ్యాపించి ఉందని కామెంట్స్ చేసింది. ఇలాంటి వాటి వల్ల సమాజంలో ద్వేషాలు పెరిగిపోతాయని తెలియజేసింది. శృతిహాసన్ సినిమాలు విషయానికి వస్తే ప్రభాస్ ,బాలకృష్ణ, చిరంజీవిలతో నటిస్తూ బిజీగా ఉన్నది.