భారీ ధ‌ర ప‌లికిన `య‌శోద‌` డిజిటల్ రైట్స్‌.. ఇంత‌కీ ఏ ఓటీటీనో తెలుసా?

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `య‌శోద‌`. హ‌రి-హ‌రీష్ ద్వ‌యం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రను పోషించారు.

నేడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. అయితే ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సమంత నటన తోనే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స‌మంత ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధ‌ర‌కు మేకర్స్ విక్రయించారట. ప్రముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో `యశోద` డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిందట. దాదాపు రూ. 45 కోట్లు చెల్లించి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే సినిమా బడ్జెట్ డిజిటల్ రైట్స్ రూపంలోనే వచ్చినట్టు అవుతుంది.

Share post:

Latest