టి20 వరల్డ్ కప్ భారత్ ఓటమిపై.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్..!

టి20 ప్రపంచ కప్ టోర్నీలో నిన్న సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి చెందటం అందర్నీ కాస్త నిరాశ కలిగించింది. చాలామంది క్రికెట్ అభిమానులు భారత జ‌ట్టుపై తీవ్ర స్థాయిలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా నుండి సీనియర్లను పక్కకు తీసేసి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ సైతం భారత్ టీమ్‌ లో సీనియర్ ఆటగాళ్లు తమ ఫార్మాట్లకు రిటైర్ ప్రకటించాలని.. ఇక భార‌త్ స్టార్ ప్లేయర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను భారత్ జట్టు కెప్టెన్ గా చేయాలని ఆయన వ్యాఖ్యానించాడు.

 Sachin Tendulkar Comments On India's Semi-final Defeat Sachin Tendulkar, Rohit S-TeluguStop.com

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ వంటి ప్లేయర్ల వల్ల టీమ్ ఇండియాకి ఏం ఉపయోగంలేదని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనదైన శైలిలో స్పందించారు. జయ అపజయాలు సహజమేనని…నాణనికి రెండు ముఖాలు ఉంటాయి.

Telugu Dinesh Karthik, Cricketersunil, Hardik Pandya, Ind Eng, Kl Rahul, Tendulk

జీవితం కూడా అంతే మన విజయం సాధించినప్పుడు అందరూ అంగీకరించినప్పుడు… ఓటమిపాలైనప్పుడు కూడా అందరూ అదే రీతిలో అంగీకరించాలి అలాగే తీసుకోవాల‌ని…గెలుపోటములు అనేవి జీవితంలో ఒకదాని వెనకాల మ‌రోక‌టి వస్తూనే ఉంటాయి..అంటూ సచిన్ టెండూల్కర్ తన సోష‌ల్‌ మీడియా ఎకౌంట్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఘోరమైన ఓటమితో కుంగిపోయిన టీమ్ ఇండియాకు తన వంతు అండగా విమర్శలను పట్టించుకోకూడదు అని విమర్శలను పాజిటివ్‌గా తీసుకోవాలని నెగిటివ్‌గా తీసుకోకుండా ఈ ఓటమి రానున్న విజయాలకు నాంది కావాలని పరోక్షంగా తెలియజేశారు.