తెలుగు బుల్లితెర రంగాల్లో ఎందరో యాంకర్లు మనల్ని ఎంతగానో అలరించారు. 10 సంవత్సరాల వెనక్కి వెళ్లి చూసుకుంటే తెలుగు బుల్లితెర పై రాణిస్తున్న యాంకర్లు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందినవారు అనే విషయం తెలుస్తుంది. సుమ కనకాల నుంచి కొత్తగా జబర్దస్త్ యాంకర్ అయిన సౌమ్య రావు వరకు దాదాపు యాంకర్ లందరూ వేరే రాష్ట్రాలకు చెందిన వారిని మరి వారు ఏ రాష్ట్రాల నుంచి వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
• సుమ కనకాల
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేరు సుమ కనకాల. కేరళలోనీ ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. సుమకు ఆరేళ్ల వయసు వున్నపుడు ఆమె తండ్రికి సికింద్రాబాద్ ట్రాన్స్‌ఫర్ అయింది. ఈ మలయాళ కుట్టి, తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న రాజీవ్ కనకాలను ప్రేమించి వివాహం చేసుకుంది. తెలుగు స్పష్టంగా మాట్లాడం నేర్చుకుని యాంకర్‌గా మన తెలుగింటి అమ్మాయిలా మనలో కలిసిపోయింది. తెలుగులో నంబర్.1 యాంకర్‌గా పేరు తెచ్చుకుంది.
• శిల్ప చక్రవర్తి
బెంగాలీ కుటుంబానికి చెందిన శిల్ప చక్రవర్తి కూడా తెలుగులో మంచి యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. శిల్ప తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో వీరి కుటుంబం సికింద్రాబాద్‌లో సెటిల్ అయ్యారు.
• రష్మీ గౌతమ్
యాంకర్ రష్మీ గౌతమ్ కూడా తెలుగు అమ్మాయి కాదు. రష్మీ తల్లి ఒడిశా, తండ్రి ఉత్తర్‌ప్రదేశ్. కానీ రష్మీ జన్మించింది మాత్రం విశాఖపట్నంలోనే. ఈమె చిన్నపటి నుంచి హిందీ, ఒడియాలో మాట్లాడుతూనే తెలుగు కొద్దికొద్దిగా నేర్చుకుంది. ప్రస్తుతం రష్మి తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు కానీ షోలలో ఫన్ క్రియేట్ చేయడానికి ఆమెతో కావాలనే తప్పులు మాట్లాడిస్తుంటారు. ప్రస్తుతం రష్మీ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో యాంకర్‌గా కొనసాగుతుంది.
• వర్షిణి
యాంకర్ వర్షిణి తమిళనాడుకి చెందిన అమ్మాయి. సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని రోజులు యాంకర్‌గా చేసింది. కానీ లక్క్ కలిసి రాలేదు.
• సౌమ్య రావు
ఇక తాజాగా జబర్దస్త్ షోలోకి కొత్త యాంకర్ అడుగుపెట్టింది. తనే సౌమ్య రావు. సౌమ్య కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో జన్మించింది. ఈమె తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించింది. జబర్దస్త్ షో నుంచి కొన్ని కారణాలతో అనసూయ తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ని సౌమ్య రావు కొట్టేసింది. మిగిలిన వారిలా సౌమ్య కూడా యాంకరింగ్ రంగంలో దుసుకుపోతుందా లేకపోతే మధ్యలోనే ఆపేస్తుందా అనేది చూడాలి.