కంటెంట్ ఉంటేనే ప్రేక్ష‌కులు చూస్తారు.. తండ్రి సినిమాపై చ‌ర‌ణ్ సెటైర్లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆచార్య`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్ స్టైల్ సమ్మిట్‌లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్ ఆచార్య సినిమా పేరు ఎత్తకుండా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ram charan
ram charan

ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత తన నుంచి ఒక స్మాల్ రిలీజ్ జరిగిందని, అందులో తాను గ్యాస్ రోల్ లాంటిది చేశానని, కానీ ఆ సినిమాను చూసేందుకు ఎవరు ముందుకు రాలేదని రామ్ చ‌ర‌ణ్ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే చూస్తారు, థియేటర్లకు వస్తారు అనడానికి ఆ సినిమా రుజువ‌ని.. కంటెంట్ లేకుంటే ఎలాంటి హీరో నటించిన ప్రేక్షకులు చూడర‌ని చ‌ర‌ణ్‌ చెప్పుకొచ్చాడు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ `ఆచార్య`. ఇందులో రామ్ చరణ్ ఒక కీలక పాత్రను పోషించారు. భారీ అంచనాలు నడవ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా ప‌డింది. ఈ సినిమా డిజాస్టర్ కావడానికి కొరటాలే కారణం అంటూ గతంలో చిరంజీవి సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమాలో కంటెంట్ లేదంటూ తేల్చేశాడు. దీంతో చ‌ర‌ణ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest