రాజమౌళికి మరో అరుదైన గౌరవం… ఇంటర్నేషనల్ ఈవెంట్ వేదికపై మరోమారు మెరిశాడు!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమాకే కాకుండా యావత్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఘనత మన రాజమౌళిదే అని సగర్వంగా చెప్పుకోవచ్చు. బాహుబలి సిరీస్ తో దేశం మెచ్చిన దర్శకుడైన రాజమౌళి RRRతో ఏకంగా దేశాలు దాటి ప్రపంచమే విస్తుపోయే విధంగా పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అనేక అవార్డులు అతనిని వరిస్తున్నాయి. అవును, గ్లోబల్ వేదికలపై RRR సత్తా చాటుతుంది. దాంతో RRR దర్శకుడైన రాజమౌళి ఇంటర్నేషనల్ వేదికలపై మెరుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ప్రఖ్యాత గాంచిన గవర్నర్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఆస్కార్ ఈవెంట్ కి ముందు లాస్ ఏంజెల్స్ లో ఈ గవర్నర్స్ అవార్డుల ప్రధానం అనేది జరుగుతుంది. ఈ వేదికపైన చిత్ర ప్రముఖులను గౌరవ అవార్డులతో సత్కరించడం జరుగుతుంది. నవంబర్ 19న జరిగిన ఈ ఈవెంట్ కి ఇండియా నుండి రాజమౌళికి అవకాశం దక్కడం విశేషం అని చెప్పుకోవాలి. టాక్సేడో సూట్ లో రాజమౌళి సూపర్ స్టైలిష్ గా మెరిశారు. RRR మూవీ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో ప్రతిష్టాత్మక సాటర్న్ అవార్డు గెలుచుకోవడం తెలిసినదే కదా.

అయితే గతంలో బాహుబలి 2 సినిమాకు సాటర్న్ అవార్డు వచ్చిన సంగతి మీకు తెలుసా? మరల రెండో సారి రాజమోళికి ఈ గౌరవం దక్కడం విశేషం. ఇకపోతే RRR ఇండియన్ నుండి పంపిన ఆస్కార్ నామినేషన్స్ లో లేకపోవడం సిగ్గుచేటు. అయితే జనరల్ కేటగిరీలో మొత్తం 15 విభాగాల్లో RRR చిత్రాన్ని ఆస్కార్ నామినేషన్స్ కోసం అప్లై చేశారు. ఇకపోతే ఈమధ్యనే జపాన్ లో విడుదలైన RRR సినిమా వసూళ్ల సునామి సృష్టిస్తోందని భోగట్టా. ఈ క్రమంలో 4 వారాల్లో ఈ మూవీ 250 మిలియన్ జపాన్ యెన్స్ వసూలు చేసింది.