సాధారణంగా దేశంలోని వివిధ రకాల రంగాలలో రాణిస్తున్న వారికి జిక్యూ మోటీ అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ వైడ్ గా తమ ప్రతిభతో మెప్పించిన వారికి ఈ మోటీ అవార్డులు అందిస్తారు. ఇక 2022 మోటీ అవార్డుల్లో లీడింగ్ మ్యాన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవార్డు సొంతం చేసుకోవడం గమనార్హం. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్పరాజ్ పాత్రకు గాను జిక్యూ మోటీ లీడింగ్ న్యూస్ 2022 అవార్డు అందుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ నుండీ జిక్యూ మోటీ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.
ఇకపోతే పుష్ప షూటింగ్ ఏరోజైతే మొదలుపెట్టారో ఆ రోజే రికార్డులతో పాటు అవార్డులు కూడా అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే తన మేనరిజం చూపించి పాన్ ఇండియా ఆడియన్స్ కి పూనకాలు వచ్చేలా చేశాడు. అలా పుష్పరాజ్ పాత్రలో లీనమైపోయి నటించారు అల్లు అర్జున్. ముఖ్యంగా సౌత్ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు పుష్పరాజ్ పాత్రకు.. పుష్ప. సినిమాతో తన 20 ఏళ్ల కెరియర్ లో ఎప్పుడు అందుకోని స్టార్డం ఈ ఒక్క సినిమాతోనే లభించిందని చెప్పవచ్చు.. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా ఒళ్ళు దాచుకోకుండా సినిమా కోసం తన బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు అల్లు అర్జున్. అందుకే ఆయన రేంజ్ కూడా అంతకంతకు పెరిగిపోతుంది.
ఇకపోతే పుష్ప పార్ట్ వన్ తో పుష్పరాజ్ కి నేషనల్ లెవెల్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు రాగా ఈ సినిమాలో తను చేసిన నటనకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి వచ్చిన కొత్త స్టార్ డం కి జిక్యూ మోటీ 2022 లీడింగ్ మ్యాన్ అవార్డు కూడా తన లిస్టులోకి చేరిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.